కార్వేటి నగరం అక్టోబర్ 24 గరుడ దాత్రి న్యూస్ విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యాలను పెంపొందించి, భవిష్యత్తులో ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కత్తెరపల్లెలో శనివారం వృత్తి విద్యా విభాగం ఆధ్వర్యంలో బీఎఫ్‌ఎస్‌ఐ ట్రేడ్ విద్యార్థులకు ప్రత్యేక గెస్ట్ లెక్చర్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తిరువళ్లూరు ప్రాంతానికి చెందిన మగజీర్ ఫైనాన్స్ కంపెనీ ఫీల్డ్ ఆఫీసర్ చందు ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులకు బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాలకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు. ఈ రంగాల్లో అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలు, అవసరమైన నైపుణ్యాలు, వృత్తిపరమైన ఎదుగుదలకు పాటించాల్సిన పద్ధతులను వివరించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు అందిస్తూ వారి సందేహాలను నివృత్తి చేశారు.ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు పాఠ్యపుస్తక పరిజ్ఞానంతో పాటు క్షేత్రస్థాయి అనుభవాన్ని అందించి, భవిష్యత్తులో సరైన వృత్తిని ఎంచుకోవడానికి దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో వృత్తి విద్యా శిక్షకులు ప్రవీణ్ హరికృష్ణ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
