ePaper
Tuesday, September 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిశ్రీ పట్టాభిరామ స్వామి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం

శ్రీ పట్టాభిరామ స్వామి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

* రూ.5.73 కోట్ల పనులకు శంకుస్థాపన.
* పాల్గొన్న టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు, టిటిడి జెఈఓ ఏ. శరత్, ఎమ్మెల్యేలు, టీటీడీ బోర్డు సభ్యులు.
కుప్పం,సెప్టెంబర్ 28 (గరుడ ధాత్రి ప్రత్యేక ప్రతినిధి): అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామి ఆలయ అభివృద్ధి పనులకు టీటీడీ పాలకవర్గ చైర్మన్ బి.ఆర్. నాయుడు శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమం సోమవారం వాల్మీకిపురంలో ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ శంకర్ యాదవ్, టీటీడీ జేఈవో ఏ. శరత్, ఇతర ఎమ్మెల్యేలు, టీటీడీ పాలకవర్గ సభ్యులు, టీడీపీ ఇన్‌చార్జ్‌లతో కలిసి పూజలు నిర్వహించి శంకుస్థాపన చేయడం జరిగింది.రూ.5.73 కోట్ల అంచనా వ్యయం పనులకు శంకుస్థాపన నిర్వహించారు.
రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై శ్రీ పట్టాభిరామస్వామి వారి కృప ఎల్లప్పుడూ ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. భారీ ఎత్తున భక్తులు ప్రజలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!