చౌడేపల్లి సెప్టెంబర్ 13 గరుడ దాత్రి న్యూస్
తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు తన సతీమణితో కలిసి ఆదివారం శ్రీ మృత్యుంజయేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న చినబాబు దంపతులకు ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వామివారి దర్శన భాగ్యం అనంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనాలు పలికి శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగు యువత నాయకులు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.
