* జగన్ నాటకాలు ప్రజలకు అర్థమైంది.
* అసత్య ప్రచారాలు మానకుంటే బుద్ధి చెప్పేందుకు ప్రజలు మళ్ళీ సిద్ధం.
* మాజీ శాసనమండలి సభ్యులు గౌని వారి శ్రీనివాసులు.
కుప్పం,సెప్టెంబర్ 13 (గరుడ ధాత్రి న్యూస్): కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పారదర్శకంగా డిఎస్సి ని నిర్వహిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి అసత్య ఆరోపణలు చేయడం తగదని మాజీ శాసనమండలి సభ్యులు మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు గౌని వారి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆదివారం ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికైనా అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. తప్పుడు ప్రచారాలు మానుకోకుంటే ప్రజలు బుద్ధి చెప్పే సమయం దగ్గరలో ఉందన్నారు.రాష్ట్రంలో నిరుద్యోగ యువత దశాబ్దాల కలను నిరంతర నిబద్ధతతో సాకారం చేస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ‘మెగా డీఎస్సీ’ నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పూర్తి చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం రికార్డు స్థాయిలో 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులను వేగవంతంగా భర్తీ చేసి, వేలాది మంది నిరుద్యోగుల ఇళ్లలో వెలుగులు నింపారన్నారు. “డీఎస్సీ అంటేనే తెలుగుదేశం. టీడీపీ పాలనలోనే నిరుద్యోగులకు నిజమైన న్యాయం” అనే నానుడిని నిజం చేస్తూ, రాజకీయాలకు అతీతంగా కేవలం ప్రతిభ ఆధారంగానే నియామకాలు పూర్తి చేసి లోకేష్ తన ప్రజా సంక్షేమ దృక్పథాన్ని, పాలనా సమర్థతను చాటుకున్నారన్నారు.మరోవైపు, పారదర్శకంగా జరిగిన ఈ మెగా నియామకాలపై అబద్ధాలు, అసత్య ఆరోపణలతో బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ తప్పుడు ప్రచారాలను నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులే గట్టిగా తిప్పికొడుతున్నారని అయినా వైసీపీకి బుద్ధి రాలేదు అన్నారు. తాము స్వచ్ఛమైన ప్రతిభతో, రాత్రింబవళ్లు కష్టపడి ఉద్యోగాలు సాధించామని, కనీసం ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా ఉద్యోగ పత్రాలు అందుకున్నామని స్పష్టం చేస్తూ ఉపాధ్యాయులంతా ‘ఆత్మగౌరవ ర్యాలీలు’ చేపడుతున్నారన్నారు. తమ కష్టాన్ని, నియామక ప్రక్రియ పవిత్రతను శంకించేలా మాట్లాడుతున్న వైసిపి నాయకులకు విద్యార్థుల ముందే గుణపాఠం చెబుతామని, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలుపుతూ నూతన ఉపాధ్యాయ లోకం స్పష్టం చేస్తోందన్నారు.
జలధారతోనే స్వర్ణాంధ్రకు పునాది:రాష్ట్ర భవిష్యత్తు నీటి భద్రతపైనే ఆధారపడి ఉందన్న దృఢ సంకల్పంతో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘జలధార-జలహారతి’ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టారన్నారు. నీటి సంరక్షణ ద్వారానే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని నమ్మే సీఎం, ఈ ప్రాజెక్టును కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ఒక శక్తివంతమైన ప్రజా ఉద్యమంగా మలచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారన్నారు.
జలయజ్ఞంలో ప్రతి చెరువును నింపడం, కాలువల పూడికతీత, మరియు మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల పునరుద్ధరణ వంటి పనులకు అగ్రతాంబూలం ఇవ్వాలని సీఎం ముందుకు పోతున్నానన్నారు. ఇలా చేయడం ద్వారా భూగర్భ జలమట్టాలు పెరిగి వ్యవసాయం లాభసాటిగా మారుతుందని, తద్వారా విద్యుత్ ఆదా అవ్వడమే కాకుండా రాష్ట్ర జీడీపీ గణనీయంగా పెరుగుతుందని ఆయన వివరించారు. సాగునీటి సంఘాలను, స్థానిక ప్రజలను ఈ క్రతువులో భాగస్వాములను చేయడం ద్వారా ‘స్వర్ణాంధ్ర’ పది సూత్రాల లక్ష్యాలను చేరుకోవచ్చని చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారన్నారు.
పారదర్శకంగా జరిగిన డీఎస్సీ పై జగన్ అసత్య ఆరోపణలు
RELATED ARTICLES
