సత్యవేడు, ఆగస్టు 3 గరుడధాత్రి :
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, ఏలూరు పరిధిలోని ఆంధ్రప్రదేశ్ అధ్యయన కేంద్రం (066) ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సత్యవేడులో 2026–27 విద్యా సంవత్సరానికి యూజీ డిగ్రీ కోర్సుల ప్రవేశాలు ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యు. నరసింహులు తెలిపారు.
ఉద్యోగులు, గృహిణులు, చదువును మధ్యలో నిలిపివేసిన వారు, అలాగే ఉన్నత విద్యను కొనసాగించాలనుకునే వారికి సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ఈ విద్యా సంవత్సరంలో బి.ఏ. (రాజనీతి శాస్త్రం–సామాజిక శాస్త్రం–పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్), బి.ఏ. (చరిత్ర–ఆర్థిక శాస్త్రం–రాజనీతి శాస్త్రం), బీఎస్సీ (ఎంపీసీ), బీఎస్సీ (ఎంపీసీఎస్), బీకాం (కంప్యూటర్ అప్లికేషన్స్), బి.లైబ్. సైన్స్ కోర్సులకు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత కలిగిన అభ్యర్థులు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 2026 సెప్టెంబర్ 15 అని వెల్లడించారు.
ఆసక్తి గల అభ్యర్థులు కళాశాల పని వేళల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సత్యవేడు నందు నేరుగా సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9951947713, 9030126907 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని ప్రిన్సిపాల్ డాక్టర్ యు. నరసింహులు తెలిపారు.
