గరుడధాత్రి :
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ (NSS) ఆధ్వర్యంలో శనివారం “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. హన్నా, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఓ. హరిప్రసాద్ నేతృత్వంలో విద్యార్థులు మొదట స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో పెద్ద ఎత్తున శ్రమదానం చేపట్టి తరగతి గదులు, మైదానాన్ని శుభ్రం చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, పరిశుభ్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల అభివృద్ధికి పరిశుభ్రమైన వాతావరణం ఎంతో అవసరమని, దీనిని ప్రతి ఒక్కరూ అలవాటుగా చేసుకోవాలని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఎం. హరిప్రసాద్, మురళీమోహన్, రవిశంకర్, సుధాకర్, వెంకటేశ్వర్లు, ఢిల్లీప్రసాద్, సిబ్బంది మరియు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.
సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘స్వచ్ఛ ఆంధ్ర’ శ్రమధానం
RELATED ARTICLES
