ePaper
Saturday, June 20, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్సత్యవేడులో ఘనంగా ‘రెవెన్యూ డే’ వేడుకలు

సత్యవేడులో ఘనంగా ‘రెవెన్యూ డే’ వేడుకలు

📰 Generate e-Paper Clip

గరుడధాత్రి :
సత్యవేడు తహసిల్దార్ శివప్రసాద్ ఆదేశాల మేరకు స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో శనివారం ‘రెవెన్యూ డే’ (రాష్ట్ర రెవెన్యూ దినోత్సవం) వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్‌ను డిప్యూటీ తహసిల్దార్లు డి. వెంకటేశ్వర్లు, త్యాగరాజు కట్ చేసి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్లు మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య రెవెన్యూ శాఖ ఒక బలమైన వారధిలా పనిచేస్తుందని పేర్కొన్నారు. నిరంతరం ప్రజలకు జవాబుదారీగా ఉంటూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేర్చడంలో మరియు భూ పరిపాలనలో రెవెన్యూ సిబ్బంది బాధ్యతాయుతంగా సేవలందించాలన్నారు. భవిష్యత్తులో చిత్తశుద్ధితో పనిచేసి మండల ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా సేవలు అందించాలని వారు పిలుపునిచ్చారు.ఈ వేడుకల్లో సత్యవేడు మండలానికి చెందిన, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు (VRO), సర్వేయర్లు, సచివాలయాల విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు (VRA) మరియు కార్యాలయ సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు తదితర రెవెన్యూ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!