కార్వేటినగరం జులై 30 (గరుడ దాద్రి న్యూస్): కార్వేటినగరం మేజర్ పంచాయతీ బాలాజీ కాలనీ వద్ద వెలసిన సాయిబాబా ఆలయంలో గురువారం ఉదయం స్వామివారికి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయ వద్ద ప్రతిరోజు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయం దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రాయల్ చెరువు, లతా బాలాజీ, ప్రధాన కార్యదర్శి చంద్రారెడ్డి, ఉపాధ్యక్షులు రామిశెట్టి రాజశేఖర్, కోశాధికారి గౌతమ్ రాజు, ఉప కోశాధికారి చిరంజీవి రెడ్డి భక్తులు కమిటీ సభ్యులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
