వరదయ్యపాళెం మండలం తహసీల్దారు కార్యాలయంలో మే 4వ తేదీన సోమవారం అన్నిశాఖల ఆధ్వర్యంలో జరిగే ప్రజాఫిర్యాదుల పరిష్కారవేదిక కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దారు సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన మాట్లాడుతూ ప్రజాసమస్యలన్నింటినీ ఒకేచోట పరిష్కారించాలనే ఆశయంతో అన్ని శాఖలకు చెందిన అధికారులు పాల్గొనే ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందిస్తే నిర్ణీత కాలపరిమితిలో పరిష్కారమవుతుందన్నారు. వివిధ సమస్యల కోసం ప్రతి సోమవారం జిల్లాకేంద్రంలోని కలెక్టరు కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగా అధికారులకు అందించడం ద్వారా పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. స్థానిక తహసీల్దారు కార్యాలయంలో అని అధికారుల నిర్వహించే ప్రజాఫిర్యాదుల పరిష్కారవేదికలో మండల ప్రజలు తమతమ సమస్యల పరిష్కారం కోసం అర్జీలు అందించి సద్వినియోగం చేసుకోవాలం ఆయన కోరారు.
