రామచంద్రపురం మండలం: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని రామచంద్రాపురం మండల బీజేపీ అధ్యక్షుడు జనార్దన్ నాయుడు పిలుపునిచ్చారు. మండల కార్యవర్గ సమావేశంలో ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రామచంద్రాపురం మండలంలో బుధవారం బీజేపీ మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు జనార్దన్ నాయుడు మాట్లాడుతూ, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ ప్రజలకు చేరువ కావాలని, బూత్ స్థాయి కమిటీలను మరింత బలోపేతం చేయాలని కోరారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో స్థానిక ఎన్నికల వ్యూహాలపై నాయకులకు పలు సూచనలు చేశారు.
స్థానిక ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: జనార్దన్ నాయుడు
RELATED ARTICLES
