సేవకుల సేవలు ఎంతో అభినందనీయమనికొనియాడినఎంపీ,ఎమ్మెల్యేలు
చిత్తూరుఅక్టోబర్02(గరుడ దాత్రి న్యూస్,)మహాత్మా గాంధీజయంతినిపురస్కరించుకుని చిత్తూరునగరంలోని జిల్లా పరిషత్ (జెడ్పీ) సమావేశ మందిరంలో ‘స్వచ్ఛ్ ఆంధ్ర అవార్డ్స్ 2026’ ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథుగా చిత్తూరు పార్లమెంట్ సభ్యులు (ఎంపీ) దగ్గుమళ్ళ ప్రసాద రావు, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ విచ్చేశారు.ఈ సందర్భంగా సమాజ పరిభ్రమణంలో,పరిశుభ్రతలో కీలక పాత్ర పోషిస్తున్న పలువురు స్వచ్ఛ ఆంధ్ర సేవకులను ఎంపీ ఎమ్మెల్యే ఘనంగా సత్కరించి, వారికి ‘స్వచ్ఛ్ ఆంధ్ర అవార్డులను’ ప్రధానం చేశారు.ఎంపీ, ఎమ్మెల్యేమాట్లాడుతూ.. పూజ్య బాపూజీ కలలుగన్న స్వచ్ఛ భారత సాధనలో స్వచ్ఛ ఆంధ్ర సేవకుల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. సమాజాన్ని స్వచ్ఛంగా, ఆరోగ్యంగా ఉంచడంలో వారు అందిస్తున్న నిరంతర సేవలుఎంతోఅభినందనీయమని ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలనివారుపిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, స్వచ్ఛ ఆంధ్ర సిబ్బంది మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
