ePaper
Tuesday, September 22, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్స్వర్ణ కుప్పం దిశగా సీఎం చంద్రబాబు అభివృద్ధి అడుగులు

స్వర్ణ కుప్పం దిశగా సీఎం చంద్రబాబు అభివృద్ధి అడుగులు

📰 Generate e-Paper Clip

.
* చంద్రన్నకు జేజేలు అంటూ జనం నినాదాలు.
* చంద్రబాబు ఆధ్వర్యంలో కుప్పంకుమ మహర్దశ.
* ఆనందంతో అభివాదం చేసిన సీఎం చంద్రబాబు.
* త్వరలోనే గండికోట నుండి కుప్పానికి నీరు.
కుప్పం,సెప్టెంబర్ 21 (గరుడ ధాత్రి న్యూస్):ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం మున్సిపాలిటీ పర్యటనలో భాగంగా సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా రూ.38 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు కీలక ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఆయన అధికారికంగా శంకుస్థాపన చేశారు. శిలాఫలకాలను ఆవిష్కరించి నిర్మాణ పనులను ప్రారంభించిన సీఎం, కుప్పం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని స్పష్టం చేస్తూ ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని భరోసానిచ్చారు. రూపంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు.కుప్పంలో రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆర్డీఓ, ఏఎస్పీ కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు.రూ.3.30 కోట్ల వ్యయంతో నిర్మించిన సమగ్ర ఘన వ్యర్ధాల నిర్వహణ ప్లాంట్, మెటిరీయల్ రికవరీ సెంటర్ ను ప్రారంభించారు.
10 ఎకరాల విస్తీర్ణంలో రూ.2.70 కోట్లతో చేపట్టనున్న మల్లనూర్ జూనియర్ కాలేజి పనులకు భూమిపూజ చేశారు.
కుప్పం మున్సిపాలిటీ లో రూ.38 కోట్ల విలువైన ప్రభుత్వ పనులకు శంకుస్థాపన నిర్వహించారు.
వ్యవసాయ ఫీడర్ల కోసం 15 మెగావాట్ల పీఎం కుసుమ్ సోలార్ ప్రాజెక్టులను ప్రారంభించారు.
కుప్పం నియోజకవర్గ కేంద్రంలోని కొత్తపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపనలు చేయడంతో పాటు, పూర్తయిన పలు నిర్మాణాలను ప్రారంభించారు. గత రెండేళ్లుగా నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పలు కీలక పనులకు ఈ సందర్భంగా శ్రీకారం చుట్టారు.
వ్యవసాయ రంగానికి మరింత ఊతమిచ్చే చర్యల్లో భాగంగా నియోజకవర్గంలోని 36,459 వ్యవసాయ విద్యుత్‌ మోటార్లను సౌర విద్యుత్‌ ఆధారిత మోటార్లుగా మార్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు రూ.60 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా రైతులకు సౌర విద్యుత్‌ను వినియోగించుకునే అవకాశం కల్పించనున్నారు.
అలాగే నియోజకవర్గంలోని 35 పాఠశాలల్లో రూ.15 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేలా వివిధ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనులు పూర్తికావడంతో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం అందుబాటులోకి రానుంది.
ఇదే సందర్భంగా డిగ్రీ కళాశాల, మహిళా ఆసుపత్రి భవన నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చిన నేపథ్యంలో వాటి ప్రారంభోత్సవాలు నిర్వహించారు. పోలీస్‌ శాఖకు సంబంధించిన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.మల్లానూర్ జూనియర్‌ కళాశాల నిర్మాణానికి కూడా ఈ సందర్భంగా శంకుస్థాపన చేశారు. సుమారు 10 ఎకరాల స్థలంలో కళాశాల భవనాన్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలను మరింత చేరువ చేసేందుకు ఈ నిర్మాణం ఉపయోగపడనుంది.
పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణకు సంబంధించి సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా మెటీరియల్‌ రికవరీ కేంద్రాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. వ్యర్థాలను వేరు చేసి పునర్వినియోగానికి అనుకూలంగా మార్చే విధంగా ఈ కేంద్రాన్ని వినియోగించనున్నారు.
కుప్పం నియోజకవర్గంలో గత రెండేళ్లుగా చేపట్టిన అభివృద్ధి, మౌలిక వసతుల పనులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలపై కూడా సభలో ప్రస్తావించారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖాముఖి మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు.నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు పనులను ఒకే వేదిక నుంచి ప్రారంభించడం, శంకుస్థాపనలు చేయడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలకు మరింత వేగం చేకూరనుంది. కార్యక కార్యక్రమానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రొజెక్టర్ వికాస్ మరమ్మత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ఉడా చైర్మన్ సురేష్ బాబు, నాలుగు మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!