*స్వీయ గణన కార్యక్రమాన్ని ప్రతి పౌరుడు బాధ్యతగా భావించి రిజిష్టర్ చేసుకోవాలి*
*తిరుపతి మెడికల్ కళాశాల సర్కిల్ నుండి ఎస్వీయూ వరకు స్వీయ గణన 5కే రన్*

*తిరుపతి, ఏప్రిల్ 26:* స్వీయ గణన కార్యక్రమాన్ని ప్రతి పౌరుడు బాధ్యతగా భావించి రిజిస్టర్ చేసుకోవాలని డి ఆర్ ఓ జి.నరసింహులు పేర్కొన్నారు.
ఆదివారం ఉదయం స్వీయ గణన పై తిరుపతి మెడికల్ కళాశాల వివేకానంద సర్కిల్ నుండి ఎస్ వి యూనివర్సిటీ వరకు నిర్వహించిన 5కే రన్ కార్యక్రమాన్ని డి ఆర్ ఓ టిటిడి బోర్డు మెంబెర్ పనబాక లక్ష్మీ, డిప్యూటీ కమిషనర్ అమరయ్య తో కలసి జెండా ఊపి ప్రారంబించారు.
ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్, ఎస్ పి ఎల్.సుబ్బారాయుడు ల ఆదేశాలతో స్వీయ గణన ప్రాముఖ్యత పై ప్రజలందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో 5కే రన్ నిర్వహించడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 5K రన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భారత జనగణన 2027లో భాగంగా రెండు దశల్లో జనగణన ప్రక్రియ జరుగుతుందన్నారు. మే 1వ నుంచి 30వ తారీఖు వరకు ఎన్యుమరేటర్ ద్వారా ఇంటింటికి వెళ్లి ఇళ్ల గణన చేపట్టడం జరుగుతుందని, 2027 ఫిబ్రవరిలో జనాభా గణన జరుగుతుందన్నారు. ఇళ్ల గణనలో భాగంగా, దేశంలో మొట్టమొదటిసారిగా ‘స్వీయ గణన’ (Self-Enumeration) అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు. స్వీయ గణన డిజిటల్ విధానం లో మొబైల్ ద్వారా ఇంటి వివరాలను నమోదు చేసుకోవాలని, నమోదు అనంతరం రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వబడుతుందన్నారు. ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఆ రిజిస్ట్రేషన్ నంబర్ చెబితే, వారు ఆ వివరాలను సరిచూసి అప్రూవ్ చేస్తారన్నారు. వివరాలను ఎడిట్ చేయాలన్నా ఎన్యుమరేటర్ ల ద్వారా సరిచూసుకుని అప్ డేట్ చేసుకోవచ్చన్నారు.
టి టి డి బోర్డు మెంబర్ మాట్లాడుతూ స్వీయ గణన పై అవగాహన కల్పించే విధంగా 5K రన్ నిర్వహించడం జరిగిందన్నారు. స్వీయ గణన ప్రాముఖ్యత ను ప్రతి ఒక్కరూ గుర్తించి డిజిటల్ విధానం లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు.
5కే రన్ లో మొదటి బహుమతి గెలుచుకున్న డి.సికిందర్ కు రూ.5వేలు, రెండవ బహుమతి గెలుచుకున్న భగవత్ కు రూ.3 వేలు, మూడవ బహుమతి గెలుచుకున్న డి.సింధూర్ కు రూ.2 వేలు నగదు బహుమతిని ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందించారు.
ఈ కార్యాలయంలో నాయి బ్రాహ్మణ కమిటీ చైర్మన్ సదాశివ, తిరుపతి అర్బన్ తాసిల్దార్ సురేష్, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్, జిల్లా అధికారులు, రెవెన్యూ సిబ్బంది , విద్యార్థిని విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.
*…డి ఐ పి ఆర్ ఓ, తిరుపతి…*
