ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్10న సుబ్రమణ్య స్వామి ఆలయం సంబంధించి తల నీలాల వేలంపాట

10న సుబ్రమణ్య స్వామి ఆలయం సంబంధించి తల నీలాల వేలంపాట

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం జూలై 2 గరుడ దాద్రి న్యూస్ :
కార్వేటినగరం పంచాయతీ కుమారగిరిపై వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి ఆలయం వద్ద జరిగే ఆడికృతిక వేడుకలు భక్తులు సమర్పిస్తే తలనీలాలు సంబంధించి ఈ నెల 10న వేలంపాట వేస్తున్నట్లు ఎండోమెంట్ కార్యనిర్వకధికారి కృష్ణ నాయక్ గురువారం ప్రకటన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 4 నుంచి 9 వరకు జరిగే ఆడికృత బ్రహ్మోత్సవ పురస్కరించుకొని స్వామివారికి భక్తులు సమర్పించే తలనీలాల సేకరణ కోసం ఈ నెల 10న శుక్రవారం ఉదయం 10 గంటలకు దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో బహిరంగ వేలం పాట నిర్వహించడం జరుగుతుంది. వేలం పాట పాడదలిచినవారు ముందుగా 20000 డిపాజిట్ చెల్లించి వేలంపాటలో పాల్గొనాలని ఆయన తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!