*విద్యుత్ అధికారులు పట్టించుకొండి ప్లీస్
బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్3
బైరెడ్డిపల్లి నుండి
కడప నత్తముకు వెళ్లేటువంటి ప్రధాన రహదారిలో గరుడా మెడికల్స్ దుకాణం ఎదురుగ్గా ఉన్నటువంటి 11 కెవి విద్యుత్ తీగల వల్ల వాహనాలకు అంతరాయం ఏర్పడింది.
వాహనాలకు తగిలే విధంగా ఈ విద్యుత్ తీగలు వాలి ఉండడంతో ప్రమాదానికి పొంచి ఉన్నది. గత వారం రోజులుగా ఇదే సమస్యతో ఆ రహదారి వెంబడి ఉండేటువంటి గృహాలకు,దుకాణదారులకు ఇబ్బందికరంగా మారింది.లోడ్ లారీలు తగిలి షార్ట్ సర్క్యూట్ ఏర్పడుతున్నది
నెలకొన్న సమస్యను స్థానిక విద్యుత్ అధికారులకు తెలియపరిచినా పట్టించుకోకపోవడంతో దుకాణదారులు ఆ రహదారి
వెంబడి ప్రయాణించేటటువంటి వాహన చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.విద్యుత్ శాఖ అధికారులు డబ్బులు వచ్చే పనులు అయితే సకాలంలో చేస్తారు లేకుంటే చేయ్యరని దుకాణదారులు మండిపడుతున్నారు.
నిత్యం లోడ్ లారీలు రావడం ఆ విద్యుత్ తీగల కు తగిలి విద్యుత్ కు అంతరాయం ఏర్పడడం ఇదే పనిగా జరుగుతున్నది.ఇకనైనా విద్యుత్ అధికారులు స్పందించి విద్యుత్ తీగలు నుండి రక్షణ కల్పించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
