ePaper
Wednesday, September 23, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్ స్టిట్యూట్ కు భూమి పూజ చేసిన సీఎం చంద్రబాబు

ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్ స్టిట్యూట్ కు భూమి పూజ చేసిన సీఎం చంద్రబాబు

📰 Generate e-Paper Clip

కుప్పం,సెప్టెంబర్ 23 (గరుడ ధాత్రి న్యూస్):

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ (ఎల్ వి పి వి ఐ) సుధా అండ్ వెంకట్ జస్తి క్యాంపస్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమి పూజ చేసి, శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. బుధవారం ఈ కార్యక్రమం అమరావతిలో జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. అమరావతిలో ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చే దిశగా ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా ఇన్స్టిట్యూట్ నమూనాలు, భవిష్యత్ ప్రణాళికలను సీఎం పరిశీలించారు. ఈ ఆసుపత్రి ద్వారా ప్రజలకు అత్యుత్తమ కంటి వైద్య సేవలు అందనున్నాయి.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!