ePaper
Wednesday, September 23, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్సూళ్లూరుపేట - కోటపోలూరు రోడ్డు పనులు ఎప్పుడు పూర్తవుతాయి?

సూళ్లూరుపేట – కోటపోలూరు రోడ్డు పనులు ఎప్పుడు పూర్తవుతాయి?

📰 Generate e-Paper Clip

నెలరోజులుగా మెటల్‌తోనే రహదారి.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు

వెంటనే పనులు పూర్తి చేయాలి: కాంగ్రెస్ నేత డి.కిరణ్ కుమార్

సూళ్లూరుపేట సెప్టెంబర్ 23 గరుడధాత్రి :

సూళ్లూరుపేట – కోటపోలూరు ప్రధాన రహదారి పనులు నత్తనడకన సాగుతుండటంపై సూళ్లూరుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డి. కిరణ్ కుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రహదారిపై మెటల్‌ పోసి నెలరోజులు గడుస్తున్నా పనులు ముందుకు సాగకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధాన రహదారిపై గులకరాళ్లు, మెటల్‌ పేరుకుపోవడంతో వాహనాలు నడపడం కష్టంగా మారిందన్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి జారిపడి గాయాలపాలవుతున్నారని తెలిపారు. రహదారిపై ఉన్న గులకరాళ్ల కారణంగా వాహనాల టైర్లు దెబ్బతినడంతో పాటు తరచూ పంక్చర్లు అవుతున్నాయని, దీంతో వాహనదారులు టైర్లు, ఇతర మరమ్మతుల కోసం అదనపు ఖర్చులు భరించాల్సి వస్తోందని పేర్కొన్నారు.
ప్రజల రాకపోకలకు కీలకమైన ఈ ప్రధాన రహదారి పనులను ఇంతకాలం పెండింగ్‌లో ఉంచడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారి పనులను వేగవంతం చేసి, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
రహదారి పరిస్థితి కారణంగా ప్రమాదాలు జరిగితే అందుకు సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందని కిరణ్ కుమార్ హెచ్చరించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని రోడ్డు పనులను తక్షణమే పూర్తి చేయాలని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని ఆయన కోరారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!