ePaper
Saturday, October 3, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతి18వ రోజుకు చేరిన వీఆర్‌ఏల నిరవధిక సమ్మె

18వ రోజుకు చేరిన వీఆర్‌ఏల నిరవధిక సమ్మె

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి అక్టోబర్ 03 గరుడ దాత్రి న్యూస్

రెవెన్యూ శాఖలో ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్న గ్రామీణ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏలు) చేపట్టిన నిరవధిక సమ్మె శనివారంతో 18వ రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వీఆర్‌ఏల సంఘం ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట శిబిరం వద్ద ఒంటికాళ్లతో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్‌ఏల సమస్యల పట్ల తీవ్ర అలసత్వం వహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా చొరవతో విధులు నిర్వహిస్తున్న తమకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపుతున్నాయని మండిపడ్డారు. వీఆర్‌ఏలకు పేస్కేల్ అమలు చేసి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలి.
అర్హులైన వీఆర్‌ఏలకు వెంటనే ప్రమోషన్లు కల్పించాలి.
సర్వీసులో ఉంటూ మరణించిన వీఆర్‌ఏల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలి.
కనీస వేతనం రూ. 26,000 చెల్లించాలి.
ప్రభుత్వం వెంటనే స్పందించి వీఆర్‌ఏల డిమాండ్లను నెరవేర్చకపోతే తమ ఆందోళనను మరిన్ని వినూత్న కార్యక్రమాల ద్వారా తీవ్రతరం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సుమంత్ రాజన్న రెడ్డి రాజా గంగులప్ప సావిత్రమ్మ భాస్కర రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!