ePaper
Monday, June 15, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతి2026 డి ఎస్ సీ ని అడ్డుకోవడమే ప్రతిపక్ష నేతల అజెండా...

2026 డి ఎస్ సీ ని అడ్డుకోవడమే ప్రతిపక్ష నేతల అజెండా…

📰 Generate e-Paper Clip

డి ఎస్ సి పై జగన్ రెడ్డి దుష్ప్రచారం…
స్పోర్ట్స్ కోటా ఎంపికల్లో పారదర్శకంగా నిర్వహించాం..
జగన్ రెడ్డి పాలనలో ఒక్క డీఎస్సీ అయినా నిర్వహించారా..?
శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు
తిరుపతి, మే 11 :

ఈ ఏడాదిలో నిర్వహించబోయే డీఎస్సీని అడ్డుకోవడమే ప్రతిపక్ష వైసిపి నేతల అజెండా అని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్
అనిమినీ రవి నాయుడు చెప్పారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో శాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడారు. డి ఎస్ సి స్పోర్ట్స్ కోట ఉపాధ్యాయ నియామకాల అంశంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు రాజకీయం ప్రేరేపితమైనవని పేర్కొన్నారు. నిరుద్యోగ యువతలో అనుమానాలు రేకెత్తించి త్వరలో కూటమి ప్రభుత్వం చేపట్టబోయే నియామకాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్ష వైసిపి నేతలు ఇలాంటి లేనిపోని ఆరోపణలకు శ్రీకారం చుట్టారన్నారు. జగన్ రెడ్డి ఐదేళ్ల ప్రభుత్వ కాలంలో ఒక్క డీఎస్సీ అయినా నిర్వహించారా..?అని ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రం డీఎస్సీ పై లేనిపోని ఆరోపణలు చేయటం రాజకీయ అవకాశవాధానికి నిదర్శనమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ని నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చి మాట నిలబెట్టుకుందని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు తొలి సంతకం తోనే డీఎస్సీకి ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. డీఎస్సీ నియామకాలను నిలిపివేయాలని ఉద్దేశంతో వైసిపి నేతలు పలు కోర్టులో కేసులు దాఖలు అయ్యాయని అప్పట్లో ఆ ప్రయత్నాలను ప్రోత్సహించిన వారే ఇప్పుడు నియామకాలపై విమర్శలు చేయడం విడ్డురంగా ఉందన్నారు. నిరుద్యోగుల భవిష్యత్తుతో రాజకీయం చేయడం బాధాకరమని ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలపై స్పందిస్తూ నవీన్ అనే వ్యక్తి కేవలం ఔట్సోర్సింగ్ ఉద్యోగి మాత్రమేనని చెప్పారు. ప్రశ్న పత్రాల నిర్వహణతో అతనికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు ఒకవైపు లీకేజీ ఆరోపణలు చేస్తూ మరోవైపు అతనికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోట లో ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకం పూర్తిగా పారదర్శకంగా నిర్వహించమని చెప్పారు. అభ్యర్థులు తమ క్రీడా అర్హతల ఆధారంగానే దరఖాస్తు చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టంగా తెలియజేయడం జరిగిందని తెలిపారు. దుర్గయ్య కేసులో అభ్యర్థి స్వయంగా తప్పుడు అర్హతతో దరఖాస్తు చేసుకున్న కారణంగానే సెలెక్ట్ కాలేదని వివరించారు. స్పోర్ట్స్ కోట దరఖాస్తుల పరిశీలన కోసం జిల్లా మధ్యస్థాయి రాష్ట్రస్థాయిలలో మూడు కమిటీలను ఏర్పాటు చేశామని తెలిపారు
ప్రతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే తుది ఎంపికలు చేపట్టామని పేర్కొన్నారు. నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లకు అడ్డుకట్ట వేసేందుకు క్రీడా యాప్ డిజిటల్ లాకర్ ఆధార్ అనుసంధానం వంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థలను ప్రవేశపెట్టామన్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో గ్రామ సచివాలయ నియామకాల లో స్పోర్ట్స్ కోట ఎంపికలపై అనేక అనుమానాలు ఉన్నాయని ప్రస్తుతం ప్రతి దశలోనూ పారదర్శకంగా ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. త్వరలో ప్రకటించబోయే డీఎస్సీని అడ్డుకునేందుకు ప్రతిపక్ష నేతలు చేస్తున్నారన్నారు. జాబ్ క్యాలెండర్ అమలును అడ్డుకోవాలని వైసిపి నేతల కుట్ర దాగి ఉందని ఆరోపించారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోట నియామకాలపై ఎవరైనా ఆధారాలు పత్రాలతో ముందుకు వస్తే ప్రజల సమక్షంలో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని రవి నాయుడు సవాల్ విసిరారు. రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు, నిరుద్యోగ యువతీ యువకులు ఎవరు నమ్మవద్దని రవి నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో శ్రీ తాతయ్యగుంట గంగమ్మ గుడి చైర్మన్ నైనార్ మహేష్ యాదవ్, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ తోట వాసుదేవ్, తెలుగు యువత రాష్ట్ర నేతలు రంజిత్ నాయుడు, హేమంత్ రాయల్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!