కార్వేటినగరం: సెప్టెంబర్ 15 (గరుడ ధాత్రి న్యూస్):
ప్రభుత్వం ప్రకటించిన తేదీ లోపు మద్యంషాపులను రెన్యూవల్ చేసుకోవాలని ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ తలమాల విజయశేఖర్ అన్నారు. మంగళవారం కార్వేటినగరం ఎక్సైజ్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 113 మద్యం షాపులు ఉన్నాయని వాటికి ప్రభుత్వం ప్రకటించిన గడువు పూర్తి కావడంతో మద్యం షాపు యజమానులు ఈ నెల 21 తేదీ సాయంత్రం 5 గంటలలోపు రెన్యూవల్ చేసుకోవాలని సూచించారు. అలా లేని యెడల ఆ మద్యం షాపులకు మరో సారి రీ టెండర్ పిలవడం జరుగుతుందని పేర్కొన్నారు. గతంలో నాలుగు ఇన్ స్టాల్ మెంట్ ద్వారా ప్రభుత్వానికి నగదు చెల్లించడం జరిగిందని, ఈ ఏడాది మూడు కంతుల్లోనే నగదు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రాసెసింగ్ ఫీజు కింద కమిషనర్ పేరుతో రూ.5 వేలు ఆన్ లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుందన్నారు. కార్వేటినగరం ఎక్సైజ్ పరిధిలోని నాలుగు మండలాలకు గాను 10 మద్యం షాపులు ఉన్నాయి.అందులో కార్వేటినగరంలో 3, వెదురుకుప్పంలో 2, శ్రీరంగరాజపురంలో 2, పాలసముద్రంలో 1 చొప్పున ఉన్నాయి.వాటితో పాటు కల్లుగీత కార్మికులకోసం ఏర్పాటు చేసిన మద్యం షాపులు, వెదురుకుప్పం,పాలసముద్రం మండలాలలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 10 షాపులు నిలుస్తున్నాయని వాటికి కూడా 2026-27 సంవత్సరానికి టెండర్ పూర్తి అయ్యిందని పేర్కొన్నారు.ఈ నెల 21 లోపు ఆన్ లైన్ ద్వారా పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసు,సిఐ శిరీష దేవి, ఎస్.ఐ శ్రావణ్, సిబ్బంది తదితరులు ఉన్నారు.
21లోగా మద్యంషాపులకు రెన్యూవల్ చేసుకోవాలి – ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్
RELATED ARTICLES
