ePaper
Friday, June 19, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

గంజాయి బారి నుండి
తిరుపతిని రక్షించుకుందాం!
-భూమన కుటుంబం నుండి యువతనుకాపాడుకుందాం!
గంజాయికి వ్యతిరేకంగా ఉద్యమించిన మహిళలు!
గరుడధాత్రి న్యూస్ :
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో యువత జీవితాన్ని నాశనం చేస్తున్న గంజాయి కి వ్యతిరేకంగా తిరుపతి కూటమి పార్టీల మహిళా విభాగాల ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో మహిళలు ఉద్యమించారు. శనివారం స్థానిక అంబేద్కర్ విగ్రహం ఎదుట శాంతియుత నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్బంగా తెలుగుదేశం, జనసేన కు చెందిన పలువురు మహిళా నాయకురాళ్లు మాట్లాడుతూ భూమన కరుణాకర్ రెడ్డి, అయన కుమారుడు అభినయ్ రెడ్డి ల కనుసన్నలో కొట్లాది రూపాయల గంజాయి వ్యాపారం జరుగుతుందన్నారు.నాలుగు రోజుల క్రితం భూమన అభినయ్ రెడ్డి ప్రధాన అనుచరుడు భాను ప్రకాష్ తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి అమ్ముతూ.. ఆరు కేజీల గంజాయితో పట్టుబడడమే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యమన్నారు.ఒరిస్సా నుండి వందల కేజీల గంజాయి తెప్పించి
పవిత్రమైన తిరుపతిలో అభినయ్ రెడ్డి తన అనుచరుల ద్వారా బస్టాండు రైల్వే స్టేషన్ కాలేజీలు చివరికి స్కూల్ ల వద్ద కూడా గంజాయిఅమ్మిస్తూకోట్లాది రూపాయలుసంపాదిస్తున్నారన్నారు.. ఈ గంజాయి వలన యువతీ యువకులు తమ జీవితాలను కోల్పోతున్నారని.. వారి తల్లి, తండ్రులు మరియు కుటుంబాలు తీవ్రమైన మానసిక క్షోభ అనుభవిస్తున్నాయన్నారు. భూమన కుటుంబం తమ అక్రమ సంపాదన కోసం బిడ్డల జీవితాలను సైతం నాశనం చేయడానికి సిద్ధపడిన ఈ తండ్రి కొడుకులను తిరుపతి నుండి వెలివేయాలని వారు డిమాండ్ చేశారు.గంజాయి వ్యాపారం చేయిస్తున్న భూమన అభినయ్ రెడ్డిపై అతని అనుచరులపై కేసు నమోదు చేయాలని.ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు..ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యదర్శి కుమారమ్మా, పార్లమెంట్ సెక్రటరీ రేవతి..జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అకేపాటి సుభాషిణి, టిడిపి నగర మహిళా విభాగం అధ్యక్షురాలు బ్యాంకు శాంతమ్మ.. ఇతర మహిళా నాయకులతో పాటు.నగరానికి చెందిన పలువురు మహిళలు భారీ సంఖ్యలో ..పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!