ePaper
Sunday, June 21, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందే

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందే

📰 Generate e-Paper Clip

-అప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుంది
:రాష్ట్ర గవర్నర్‌కు వైయస్సార్‌సీపీ విజ్ఞప్తి

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ విజయవాడ లోక్‌భవన్‌లో గవర్నర్‌ శ్రీ అబ్ధుల్‌ నజీర్‌ గారిని కలిసిన వైయస్సార్‌సీపీ ప్రతినిధులు. మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో గవర్నర్‌ను కలిసిన ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి, మురుగుడు హనుమంతరావు, వరుదు కల్యాణి, ఎంవీ రామచంద్రారెడ్డి, మొహమ్మద్‌ రుహుల్లా, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేరుగు నాగార్జున, జోగి రమేశ్, ఆదిమూలపు సురేశ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ గ్రీవెన్స్‌ సెల్‌ అధ్యక్షుడు నారాయణమూర్తితో పాటు, ఉత్తర అమెరికాలో మాజీ ప్రభుత్వ ప్రతినిధి పండుగాయల రత్నాకర్‌.
అనంతరం లోక్‌భవన్‌ వద్ద మీడియాతో మాట్లాడిన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ.

మెగా డీఎస్సీ పేరుతో దగా డీఎస్సీ
డీఎస్సీలో అడుగడుగునా ఆక్రమాలే
మేం ప్రశ్నించాకే సెలక్షన్‌ లిస్ట్‌ ఇచ్చారు
జీవోలు మార్చి స్పోర్ట్స్‌ కోటాలో అక్రమాలు
:బొత్స సత్యనారాయణ ఆక్షేపణ

డీఎస్సీ అక్రమాల్ని గవర్నర్‌ గారికి వివరించాం
రాష్ట్ర దర్యాప్తుతో ప్రయోజనం ఉండదని చెప్పాం
సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్డితో దర్యాప్తు చేయించాలి
గవర్నర్‌ సానుకూలంగా స్పందించారు
:బొత్స సత్యనారాయణ వెల్లడి

లోకేష్‌ ఇకనైనా పిల్ల చేష్టలు ఆపాలి
తప్పు జరగకపోతే సీబీఐ దర్యాప్తుకు భయమెందుకు ?
సాయికృష్ణ లాకప్‌ డెత్‌ ప్రభుత్వ హత్యే
దీనిపైనా సీబీఐ దర్యాప్తు చేయించాల్సిందే
తేల్చిచెప్పిన బొత్స సత్యనారాయణ

లోక్‌ భవన్, విజయవాడ:
డీఎస్సీలో కూటమి ప్రభుత్వం అడుగడుగునా అక్రమాలకు పాల్పడిందని, మెగా డీఎస్సీని కాస్తా దగా డీఎస్సీగా మార్చేసిందని, దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, బాధితులకు న్యాయం జరుగుతుందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. పార్టీ ఎమ్మెల్సీలు, నేతలతో కలిసి లోక్‌భవన్‌లో గవర్నర్‌ శ్రీ అబ్ధుల్‌ నజీర్‌ను కలిసి ఆ మేరకు వినతిపత్రం సమర్పించిన అనంతరం మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ లోక్‌భవన్‌ వద్ద మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..:

గవర్నర్‌ దృష్టికి డీఎస్సీ అక్రమాలు తీసుకెళ్లాం:
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న దుశ్చర్యలపై గవర్నర్‌ కు ఫిర్యాదు చేశాం. ముఖ్యంగా మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులకు ఆశలు కల్పించి పూర్తిగా దగా చేశారని గవర్నర్‌ గారికి చెప్పాం. విపక్షం కానీ ప్రజలు కానీ ఆధారాలతో సహా ఏదైనా విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పుడు సందేహాల్ని నివృతి చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అలా జరగలేదు. ముందుగానే ప్రభుత్వం తాము అనుకున్న వ్యక్తులతో లాలూచీ పడి డీఎస్సీ ప్రశ్నాపత్రం సెట్‌ చేసిన దగ్గరి నుంచి ఉద్యోగాలు ఇచ్చే వరకూ, స్పోర్ట్స్‌ కోటాతో కలిపి అక్రమాలకు పాల్పడింది. దీనిపై ఐదు అంశాలతో గవర్నర్‌ గారికి ఫిర్యాదు చేశాం. ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భావం తర్వాత డీఎస్సీ నిర్వహించినప్పుడు ఎంపికైన అభ్యర్ధుల జాబితాల్ని కలెక్టర్‌ కార్యాలయాల్లో పెట్టేవారు. ఆ తర్వాత ఇంటర్వ్యూలకు పిలిచేవారు. కానీ ఇప్పుడు ఆ లిస్ట్‌ ఎక్కడుంది. సమస్యపై మేం ప్రశ్నించిన తర్వాత అన్నీ సర్దుకుని సెలక్షన్‌ లిస్ట్‌ వెబ్‌ సైట్‌ లో పెట్టారు. దీనిపై నేనే స్వయంగా నలుగురు డీఈవోలతో మాట్లాడాను. కానీ వారి దగ్గర లిస్టు దొరకలేదు.
మేం ప్రశ్నించడం మొదలుపెట్టాక వెబ్‌ సైట్లో పెట్టారు. అంటే ఇక్కడ ఏదో జరిగింది. ప్రభుత్వ పెద్దలు ఇందులో జోక్యం చేసుకున్నారు. అక్రమాలపై ఫోన్‌ కాల్స్‌ బయటికి వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా విచారణ జరిపి కేసులు పెడుతుంది. కానీ ఇక్కడ ఏ చర్యలూ తీసుకోలేదు. నేను, ఆదిమూలపు సురేశ్‌ కూడా విద్యాశాఖ మంత్రులుగా పనిచేసాం. పదో తరగతి పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ జరిగితే వెంటనే బాధ్యుల్ని అరెస్టు చేసి జైళ్లకు పంపాం. కానీ ఇక్కడ మాత్రం అక్రమాలను ఏమాత్రం పట్టించుకోలేదు.
గత ప్రభుత్వంలో స్పోర్ట్స్‌ కోటా జీవోలు ఉంటే వాటిని మార్చి జీవోలు ఇచ్చారు. డీఎస్సీ పరీక్ష పూర్తయ్యాక మళ్లీ అవే జీవోల్ని మార్చేశారు. స్పోర్ట్స్‌ కోటాలో బ్రిడ్జ్‌ ఆట కూడా గేమ్‌ అని ఉద్యోగాలు ఇచ్చేశారు. కానీ ఇప్పుడు నిస్సిగ్గుగా పాత ప్రభుత్వం ఇచ్చిందని చెప్తున్నారు. మా ప్రభుత్వంలో ఇస్తే జీవో చూపించమని కోరుతున్నాం.

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరగాల్సిందే:
పరీక్ష రాసి ఉద్యోగం రాకపోతే తమ కన్నా మెరుగైన ప్రతిభ ఉన్న వారికి వచ్చాయని అభ్యర్ధులకు ఓ సంతృప్తి ఉంటుంది. కానీ అక్రమాలు జరిగి తమకు రావాల్సిన ఉద్యోగాలు ఎవరికో వెళ్లిపోతే అసలు ఉద్యోగాలు తెచ్చుకున్న వారికి ఎలా ఉంటుంది. ఇది తండ్రీ కొడుకులకు ధర్మమా? ఇవే అంశాలు గవర్నర్‌ గారికి చెప్పాం. రాష్ట్ర ప్రభుత్వంతో విచారణ జరిపిస్తే ఉపయోగం ఉండదు. కాబట్టి ధర్డ్‌ పార్టీ ఎంక్వైరీ జరగాలని అడిగాం. హైకోర్టు సిట్టింగ్‌ జడ్డి లేదా సీబీఐ దర్యాప్తు జరగాలని కోరాం. ప్రభుత్వ వివరణ తీసుకుంటామని గవర్నర్‌ గారు చెప్పారు. విద్యార్ధుల భవిష్యత్తుతో, వారి మనోభావాలతో ఆడుకోవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాబట్టి డీఎస్సీ మీద సీబీఐ దర్యాప్తు జరగాల్సిందే. డీఎస్సీ జరిగిన తీరు మీద మాకు ఏమాత్రం నమ్మకం లేదు. అధికారులు ఒక్కోసారి వచ్చి ఒక్కో వివరణ ఇస్తున్నారు. అధికారులు కోరుకుంటే వారిని కలిసి మా అభ్యంతరాలు చెప్పేందుకు సిద్దంగా ఉన్నాం. అలా కాకుండా ప్రభుత్వం చెప్పింది కాబట్టి చేస్తున్నాం అంటే మాత్రం ఏమీ చేయలేం. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిగే వరకూ వైఎస్సార్సీపీ పోరాడుతూనే ఉంటుంది.

మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..
లోకేష్‌వి పిల్ల చేష్టలు:
లోకేష్‌ వి పిల్ల చేష్టలు. ఓ మంత్రి పదవిలో ఉండి, రోడ్డు మీద కనిపించి మీ ఇంటికి వస్తానని సవాళ్లు విసరడం ఏంటి ? నేను కూడా రేపు చంద్రబాబు ఇంటికి వస్తానంటాను. గతంలో మా పార్టీ నాయకుడు జోగి రమేశ్‌ చంద్రబాబు ఇంటికి వెళ్తే ఆయన్ను ఎందుకు అరెస్టు చేశారో చెప్పండి. లోకేష్‌ ఇక్కడికి వస్తానంటే సమాధానం చెప్పేందుకు సిద్దం, గవర్నర్‌ గారిని కూడా పిలుస్తాం. కాబట్టి లోకేష్‌ కుర్ర చేష్టలు, అవగాహన లేని మాటలు కట్టిబెట్టాలి. డీఎస్సీ అక్రమాలు మా దృష్టికి రాగానే మేం సీబీఐ దర్యాప్తు కోరుతున్నాం. లోకేష్‌ కు మాత్రం ఇప్పుడు గుర్తుకొచ్చినట్లుంది.
పరీక్ష పారదర్శకంగా నిర్వహించి ఉంటే సీబీఐ దర్యాప్తుకు భయమెందుకు? ఉమ్మడి రాష్ట్రంలో పరిశ్రమల మంత్రిగా ఉండగా నాపై కూడా 14.70 కోట్లు తినేశామని జర్మనీకి చెందిన ఫోక్స్‌ వ్యాగన్‌ కంపెనీ ప్రతినిధులకు ఇచ్చేశామని పత్రికల్లో పుంఖాను పుంఖాలుగా రాశారు. సీఎంగా ఉన్న రాజశేఖర్‌ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి సీబీఐ దర్యాప్తు చేయించమని అడిగాం. ఇప్పుడు కూడా మేం తప్పు చేయలేదని తెలుసు కాబట్టే సీబీఐ దర్యాప్తు చేయించాలని అడుగుతున్నాం.

సాయికృష్ణది ప్రభుత్వ హత్య:
విజయవాడలో సాయికృష్ణ లాకప్‌ డెత్‌ ప్రభుత్వ హత్యే. ఎవరైనా అనుమానాస్పదంగా చనిపోతే సెక్షన్‌ 302 లేదా 307 పెడతారు. అప్పుడు దానిపై చర్యలు తీసుకుంటారు. కానీ ఇక్కడ ఎలాంటి చర్యల్లేవు. ప్రభుత్వం పోలీసులతో కుమ్మక్కై ఈ హత్యకు పాల్పడింది. కాబట్టి హంతకుల్ని వెంటనే అరెస్టు చేయాలి. మేము అధికారంలో ఉండగా నంద్యాలలో ఓ ఆటోడ్రైవర్‌ ఏదో చేశాడని భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడు బాధ్యులైన అధికారుల్ని సస్పెన్షన్‌ తో వదిలిపెట్టలేదు అరెస్టు చేశాం. ఈ హత్యకు కారకులందరూ బయటికి రావాలంటే సీబీఐ దర్యాప్తు జరగాల్సిందే. ముందు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలి. ఆ తర్వాత సీబీఐ దర్యాప్తు జరిపించండి. అప్పుడే ప్రజలకు వ్యవస్థ మీద నమ్మకం ఏర్పడుతుందని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందే
-అప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుంది
:-రాష్ట్ర గవర్నర్‌కు వైయస్సార్‌సీపీ విజ్ఞప్తి

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ విజయవాడ లోక్‌భవన్‌లో గవర్నర్‌ శ్రీ అబ్ధుల్‌ నజీర్‌ గారిని కలిసిన వైయస్సార్‌సీపీ ప్రతినిధులు. మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో గవర్నర్‌ను కలిసిన ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి, మురుగుడు హనుమంతరావు, వరుదు కల్యాణి, ఎంవీ రామచంద్రారెడ్డి, మొహమ్మద్‌ రుహుల్లా, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేరుగు నాగార్జున, జోగి రమేశ్, ఆదిమూలపు సురేశ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ గ్రీవెన్స్‌ సెల్‌ అధ్యక్షుడు నారాయణమూర్తితో పాటు, ఉత్తర అమెరికాలో మాజీ ప్రభుత్వ ప్రతినిధి పండుగాయల రత్నాకర్‌.
అనంతరం లోక్‌భవన్‌ వద్ద మీడియాతో మాట్లాడిన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ.

మెగా డీఎస్సీ పేరుతో దగా డీఎస్సీ
డీఎస్సీలో అడుగడుగునా ఆక్రమాలే
మేం ప్రశ్నించాకే సెలక్షన్‌ లిస్ట్‌ ఇచ్చారు
జీవోలు మార్చి స్పోర్ట్స్‌ కోటాలో అక్రమాలు
:బొత్స సత్యనారాయణ ఆక్షేపణ

డీఎస్సీ అక్రమాల్ని గవర్నర్‌ గారికి వివరించాం
రాష్ట్ర దర్యాప్తుతో ప్రయోజనం ఉండదని చెప్పాం
సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్డితో దర్యాప్తు చేయించాలి
గవర్నర్‌ సానుకూలంగా స్పందించారు
:బొత్స సత్యనారాయణ వెల్లడి

లోకేష్‌ ఇకనైనా పిల్ల చేష్టలు ఆపాలి
తప్పు జరగకపోతే సీబీఐ దర్యాప్తుకు భయమెందుకు ?
సాయికృష్ణ లాకప్‌ డెత్‌ ప్రభుత్వ హత్యే
దీనిపైనా సీబీఐ దర్యాప్తు చేయించాల్సిందే
తేల్చిచెప్పిన బొత్స సత్యనారాయణ

లోక్‌ భవన్, విజయవాడ:
డీఎస్సీలో కూటమి ప్రభుత్వం అడుగడుగునా అక్రమాలకు పాల్పడిందని, మెగా డీఎస్సీని కాస్తా దగా డీఎస్సీగా మార్చేసిందని, దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, బాధితులకు న్యాయం జరుగుతుందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. పార్టీ ఎమ్మెల్సీలు, నేతలతో కలిసి లోక్‌భవన్‌లో గవర్నర్‌ శ్రీ అబ్ధుల్‌ నజీర్‌ను కలిసి ఆ మేరకు వినతిపత్రం సమర్పించిన అనంతరం మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ లోక్‌భవన్‌ వద్ద మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..:

గవర్నర్‌ దృష్టికి డీఎస్సీ అక్రమాలు తీసుకెళ్లాం:
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న దుశ్చర్యలపై గవర్నర్‌ కు ఫిర్యాదు చేశాం. ముఖ్యంగా మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులకు ఆశలు కల్పించి పూర్తిగా దగా చేశారని గవర్నర్‌ గారికి చెప్పాం. విపక్షం కానీ ప్రజలు కానీ ఆధారాలతో సహా ఏదైనా విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పుడు సందేహాల్ని నివృతి చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అలా జరగలేదు. ముందుగానే ప్రభుత్వం తాము అనుకున్న వ్యక్తులతో లాలూచీ పడి డీఎస్సీ ప్రశ్నాపత్రం సెట్‌ చేసిన దగ్గరి నుంచి ఉద్యోగాలు ఇచ్చే వరకూ, స్పోర్ట్స్‌ కోటాతో కలిపి అక్రమాలకు పాల్పడింది. దీనిపై ఐదు అంశాలతో గవర్నర్‌ గారికి ఫిర్యాదు చేశాం. ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భావం తర్వాత డీఎస్సీ నిర్వహించినప్పుడు ఎంపికైన అభ్యర్ధుల జాబితాల్ని కలెక్టర్‌ కార్యాలయాల్లో పెట్టేవారు. ఆ తర్వాత ఇంటర్వ్యూలకు పిలిచేవారు. కానీ ఇప్పుడు ఆ లిస్ట్‌ ఎక్కడుంది. సమస్యపై మేం ప్రశ్నించిన తర్వాత అన్నీ సర్దుకుని సెలక్షన్‌ లిస్ట్‌ వెబ్‌ సైట్‌ లో పెట్టారు. దీనిపై నేనే స్వయంగా నలుగురు డీఈవోలతో మాట్లాడాను. కానీ వారి దగ్గర లిస్టు దొరకలేదు.
మేం ప్రశ్నించడం మొదలుపెట్టాక వెబ్‌ సైట్లో పెట్టారు. అంటే ఇక్కడ ఏదో జరిగింది. ప్రభుత్వ పెద్దలు ఇందులో జోక్యం చేసుకున్నారు. అక్రమాలపై ఫోన్‌ కాల్స్‌ బయటికి వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా విచారణ జరిపి కేసులు పెడుతుంది. కానీ ఇక్కడ ఏ చర్యలూ తీసుకోలేదు. నేను, ఆదిమూలపు సురేశ్‌ కూడా విద్యాశాఖ మంత్రులుగా పనిచేసాం. పదో తరగతి పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ జరిగితే వెంటనే బాధ్యుల్ని అరెస్టు చేసి జైళ్లకు పంపాం. కానీ ఇక్కడ మాత్రం అక్రమాలను ఏమాత్రం పట్టించుకోలేదు.
గత ప్రభుత్వంలో స్పోర్ట్స్‌ కోటా జీవోలు ఉంటే వాటిని మార్చి జీవోలు ఇచ్చారు. డీఎస్సీ పరీక్ష పూర్తయ్యాక మళ్లీ అవే జీవోల్ని మార్చేశారు. స్పోర్ట్స్‌ కోటాలో బ్రిడ్జ్‌ ఆట కూడా గేమ్‌ అని ఉద్యోగాలు ఇచ్చేశారు. కానీ ఇప్పుడు నిస్సిగ్గుగా పాత ప్రభుత్వం ఇచ్చిందని చెప్తున్నారు. మా ప్రభుత్వంలో ఇస్తే జీవో చూపించమని కోరుతున్నాం.

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరగాల్సిందే:
పరీక్ష రాసి ఉద్యోగం రాకపోతే తమ కన్నా మెరుగైన ప్రతిభ ఉన్న వారికి వచ్చాయని అభ్యర్ధులకు ఓ సంతృప్తి ఉంటుంది. కానీ అక్రమాలు జరిగి తమకు రావాల్సిన ఉద్యోగాలు ఎవరికో వెళ్లిపోతే అసలు ఉద్యోగాలు తెచ్చుకున్న వారికి ఎలా ఉంటుంది. ఇది తండ్రీ కొడుకులకు ధర్మమా? ఇవే అంశాలు గవర్నర్‌ గారికి చెప్పాం. రాష్ట్ర ప్రభుత్వంతో విచారణ జరిపిస్తే ఉపయోగం ఉండదు. కాబట్టి ధర్డ్‌ పార్టీ ఎంక్వైరీ జరగాలని అడిగాం. హైకోర్టు సిట్టింగ్‌ జడ్డి లేదా సీబీఐ దర్యాప్తు జరగాలని కోరాం. ప్రభుత్వ వివరణ తీసుకుంటామని గవర్నర్‌ గారు చెప్పారు. విద్యార్ధుల భవిష్యత్తుతో, వారి మనోభావాలతో ఆడుకోవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాబట్టి డీఎస్సీ మీద సీబీఐ దర్యాప్తు జరగాల్సిందే. డీఎస్సీ జరిగిన తీరు మీద మాకు ఏమాత్రం నమ్మకం లేదు. అధికారులు ఒక్కోసారి వచ్చి ఒక్కో వివరణ ఇస్తున్నారు. అధికారులు కోరుకుంటే వారిని కలిసి మా అభ్యంతరాలు చెప్పేందుకు సిద్దంగా ఉన్నాం. అలా కాకుండా ప్రభుత్వం చెప్పింది కాబట్టి చేస్తున్నాం అంటే మాత్రం ఏమీ చేయలేం. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిగే వరకూ వైఎస్సార్సీపీ పోరాడుతూనే ఉంటుంది.

మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..
లోకేష్‌వి పిల్ల చేష్టలు:
లోకేష్‌ వి పిల్ల చేష్టలు. ఓ మంత్రి పదవిలో ఉండి, రోడ్డు మీద కనిపించి మీ ఇంటికి వస్తానని సవాళ్లు విసరడం ఏంటి ? నేను కూడా రేపు చంద్రబాబు ఇంటికి వస్తానంటాను. గతంలో మా పార్టీ నాయకుడు జోగి రమేశ్‌ చంద్రబాబు ఇంటికి వెళ్తే ఆయన్ను ఎందుకు అరెస్టు చేశారో చెప్పండి. లోకేష్‌ ఇక్కడికి వస్తానంటే సమాధానం చెప్పేందుకు సిద్దం, గవర్నర్‌ గారిని కూడా పిలుస్తాం. కాబట్టి లోకేష్‌ కుర్ర చేష్టలు, అవగాహన లేని మాటలు కట్టిబెట్టాలి. డీఎస్సీ అక్రమాలు మా దృష్టికి రాగానే మేం సీబీఐ దర్యాప్తు కోరుతున్నాం. లోకేష్‌ కు మాత్రం ఇప్పుడు గుర్తుకొచ్చినట్లుంది.
పరీక్ష పారదర్శకంగా నిర్వహించి ఉంటే సీబీఐ దర్యాప్తుకు భయమెందుకు? ఉమ్మడి రాష్ట్రంలో పరిశ్రమల మంత్రిగా ఉండగా నాపై కూడా 14.70 కోట్లు తినేశామని జర్మనీకి చెందిన ఫోక్స్‌ వ్యాగన్‌ కంపెనీ ప్రతినిధులకు ఇచ్చేశామని పత్రికల్లో పుంఖాను పుంఖాలుగా రాశారు. సీఎంగా ఉన్న రాజశేఖర్‌ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి సీబీఐ దర్యాప్తు చేయించమని అడిగాం. ఇప్పుడు కూడా మేం తప్పు చేయలేదని తెలుసు కాబట్టే సీబీఐ దర్యాప్తు చేయించాలని అడుగుతున్నాం.

సాయికృష్ణది ప్రభుత్వ హత్య:
విజయవాడలో సాయికృష్ణ లాకప్‌ డెత్‌ ప్రభుత్వ హత్యే. ఎవరైనా అనుమానాస్పదంగా చనిపోతే సెక్షన్‌ 302 లేదా 307 పెడతారు. అప్పుడు దానిపై చర్యలు తీసుకుంటారు. కానీ ఇక్కడ ఎలాంటి చర్యల్లేవు. ప్రభుత్వం పోలీసులతో కుమ్మక్కై ఈ హత్యకు పాల్పడింది. కాబట్టి హంతకుల్ని వెంటనే అరెస్టు చేయాలి. మేము అధికారంలో ఉండగా నంద్యాలలో ఓ ఆటోడ్రైవర్‌ ఏదో చేశాడని భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడు బాధ్యులైన అధికారుల్ని సస్పెన్షన్‌ తో వదిలిపెట్టలేదు అరెస్టు చేశాం. ఈ హత్యకు కారకులందరూ బయటికి రావాలంటే సీబీఐ దర్యాప్తు జరగాల్సిందే. ముందు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలి. ఆ తర్వాత సీబీఐ దర్యాప్తు జరిపించండి. అప్పుడే ప్రజలకు వ్యవస్థ మీద నమ్మకం ఏర్పడుతుందని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!