ePaper
Sunday, June 21, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్అక్రమ మద్యం షాపులపై ఎక్సైజ్ పోలీసులు విస్తృత దాడులు

అక్రమ మద్యం షాపులపై ఎక్సైజ్ పోలీసులు విస్తృత దాడులు

📰 Generate e-Paper Clip

– బెల్ట్ షాప్ నిర్వాహకులపై కేసు నమోదు

పలమనేరు , జూన్ 20 ( గరుడ ధాత్రి ) :

పలమనేరు నియోజకవర్గంలోని పలు గ్రామాలలో అక్రమ మద్యం విక్రయం, బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించిన వారిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎక్సైజ్ పోలీస్లు కేసు నమోదు చేసినట్లు పలమనేరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ భాగ్యలక్ష్మి తెలిపారు. శుక్రవా రం, శనివారం రెండు రోజులు పలమనేరు నియోజకవర్గం పరిధిలో అక్రమంగా మద్యం విక్ర యించే వారిపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో భాగంగా బైరెడ్డిపల్లి మండలం బీసీ కాలనీ తనిఖీలలో 10 మద్యం సీసాలు,దాసర్లపల్లి గ్రామంలో 21 మద్యం బాటిళ్ల ను, గంగవరం మండలం పత్తికొండ బస్ స్టాప్ వద్ద తనిఖీలలో 8 మద్యం బాటిల్ లు, కీలపల్లి క్రాస్ వద్ద 12 మద్యం బాటిల్ లు, ధర్మపురి బస్టాప్ వద్ద తనిఖీలలో
ఎనిమిది మద్యం బాటిల్స్, స్వాధీనం చేసుకోవడం జరిగినదనీ తెలిపారు
పలమనేర్ మండలం టీ వడ్డూరు గ్రామంలోను గంగవరం మండలం కీలపట్ల బత్తలపల్లి లో అనుమానాస్పద ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించడం జరిగినది. మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని, వారి పై బెల్ట్ షాపు కేసు నమోదు చేశారు. ఇద్దరు వ్యక్తులు బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తూ పట్టుబడగా, వారి పై సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేశారు. అక్రమ మద్యం విక్రయాలు, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఎక్సైజ్ శాఖ నిరంతర తనిఖీలు నిర్వహిస్తుందని, ప్రజలు ఇటువంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ ప్రత్యేక తనిఖీ లలో సీఐ భాగ్యలక్ష్మి, ఎస్సై మస్తాన్ హెడ్ కానిస్టేబుల్ ఇస్మాయిల్, కానిస్టేబుల్ సతీష్, కానిస్టేబుల్ కుమార్
పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!