ePaper
Tuesday, June 23, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్గిరిజనులకు అండగా నిలిచిన అధికారులు

గిరిజనులకు అండగా నిలిచిన అధికారులు

📰 Generate e-Paper Clip

-24 గంటల్లోనే డొమిసైల్ సర్టిఫికెట్ల మంజూరు!

సత్యవేడు జూన్ 22 గరుడధాత్రి :
సత్యవేడు మండలం, చెరివి స్వర్ణ గ్రామంలోని గిరిజన సామాజిక వర్గానికి చెందిన పలువురు నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా స్థానిక మండల అధికారులు ప్రత్యేక చొరవ చూపారు.గ్రామంలోని చాలా మంది ఎస్టీ ప్రజలకు ఆధార్ కార్డులు లేకపోవడంతో, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ వంటి పలు సంక్షేమ పథకాలు వారికి అందడం లేదు. ఈ విషయాన్ని గమనించి ఎంపీడీవో గ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి అధికారులు రంగంలోకి దిగారు. చెరివి స్వర్ణ గ్రామానికి సెక్రటరీ శైలేంద్ర, పంచాయతీ అభివృద్ధి అధికారి గోపి, సంక్షేమ మరియు విద్యా సహాయకులు విజయ్, మరియు డిజిటల్ అసిస్టెంట్ కలిసి తక్షణమే స్పందించారు.ఆధార్ కార్డుల నమోదు కోసం వీరందరికీ డొమిసైల్ సర్టిఫికెట్లు అత్యవసరమని గుర్తించిన అధికారులు, ఈ విషయాన్ని ఎమ్మార్వో తహశీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్య తీవ్రతను అర్థం చేసుకున్న ఎమ్మార్వో మానవతా దృక్పథంతో స్పందిస్తూ.. వెంటనే చెరివి వీఆర్వో ఆదేశించారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే 17 మంది ఎస్టీ లబ్ధిదారులకు డొమిసైల్ సర్టిఫికెట్లను మంజూరు చేయించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో సత్యవేడు డిప్యూటీ ఎంపీడీవో బి. ముని రవికుమార్, మహిళా సంరక్షణ కార్యదర్శి శ్యామల, మరియు స్థానిక నాయకులు బాల శంకర్ తదితరులు పాల్గొని, గిరిజనులకు సర్టిఫికెట్లు అందేలా పర్యవేక్షించారు. ప్రభుత్వ అధికారులు ఇంత వేగంగా స్పందించి తమ సమస్యను తీర్చడం పట్ల స్థానికులు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!