ePaper
Sunday, August 2, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్నారా లోకేష్ ను కలసిన టిడిపి మహిళా నేత పుష్పావతి యాదవ్

నారా లోకేష్ ను కలసిన టిడిపి మహిళా నేత పుష్పావతి యాదవ్

📰 Generate e-Paper Clip

తిరుపతి, జులై 2 గరుడధాత్రి :
తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ను టిడిపి రాష్ట్ర మాజీ కార్యదర్శి పుష్పావతి యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. నారా లోకేష్ వెంట
పుష్పావతి యాదవ్ తో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అనంతరం శ్రీ సిటీలో యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బయలుదేరి వెళుతున్న మంత్రి నారా లోకేష్ కు వ్యవసాయ కళాశాల హెలిపాడ్ వద్ద పుష్పావతి యాదవ్ వీడ్కోలు పలికారు. ఆమెతో పాటు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టిడిపి రాష్ట్ర మాజీ కార్యదర్శి దంపురి భాస్కర్ యాదవ్ కూడా వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!