ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్వెడిచర్లలో రూ.40 లక్షలతో మాతమ్మ ఆలయ నిర్మాణానికి భూమిపూజ

వెడిచర్లలో రూ.40 లక్షలతో మాతమ్మ ఆలయ నిర్మాణానికి భూమిపూజ

📰 Generate e-Paper Clip

గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ సూచనల మేరకు గూడూరు మండలం వెడిచర్ల గ్రామంలోని అరుంధతివాడలో ఉన్న మాతమ్మ అమ్మవారి దేవస్థానం నూతన నిర్మాణ పనులకు ఆదివారం భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గంటా మధుకృష్ణ, సుబ్బారెడ్డి హాజరై కొబ్బరికాయ కొట్టి, వేదమంత్రోచ్చారణల నడుమ భూమిపూజ నిర్వహించారు. అనంతరం ఇంజనీరు, తాపీ మేస్త్రి, విగ్రహ శిల్పితో మాట్లాడి ఆలయ నిర్మాణ పనులను నాణ్యతతో పాటు త్వరితగతిన పూర్తి చేయాలని తెల్పారు ..వెడిచర్ల గ్రామంలోని అరుంధతివాడలో ఉన్న మాతమ్మ దేవస్థానం శిథిలావస్థకు చేరడంతో గ్రామ టీడీపీ నాయకుడు మారుబోయిన దామోదర్ ఈ విషయాన్ని ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, టీటీడీ అధికారులతో మాట్లాడి ఆలయ నిర్మాణానికి రూ.40 లక్షల నిధులు మంజూరు చేయించారని దామోదర్ తెలిపారు.గ్రామ ప్రజలు, ఆలయ నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!