ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్రెండేళ్ల కూటమి ప్రభుత్వ అభివృద్ధిని చూడండి

రెండేళ్ల కూటమి ప్రభుత్వ అభివృద్ధిని చూడండి

📰 Generate e-Paper Clip

–ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

చిత్తూరు జూలై 30,(గరుడ రాత్రి న్యూస్)రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి స్థానిక ఎన్నికల్లో మద్దతుగా నిలవాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ప్రజలకు పిలుపునిచ్చారు. “రెండేళ్ల ప్రభుత్వ పాలన – ఇంటింటి ప్రచారం” కార్యక్రమంలో భాగంగా గురువారం సాయంత్రం చిత్తూరు నగరపాలక పరిధిలోని 31,32 డివిజన్ పరిధిలో స్థానిక కూటమి నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సందర్భంగా గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. చిత్తూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. గతంలో ఎన్నడూ లేనంతగా చిత్తూరులో రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు. అన్ని డివిజన్ పరిధిలోని ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా సిమెంట్ రోడ్లు, కాలువలు నిర్మిస్తున్నట్లు వివరించారు. సూపర్ సిక్స్ హామీలను నెర వేర్చమన్నారు. కార్యక్రమంలో చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత, తెదేపా నియోజకవర్గ పరిశీలకులు కుమారి, కూటమి నాయకులు సీకే లావణ్య, కాజూరు బాలాజీ, నరేష్, డివిజన్, బూత్ ఇన్చార్జులు, మాజీ కార్పొరేటర్లు, స్థానిక తెదేపా కమిటీల సభ్యులు, డివిజన్ పరిధిలోని కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!