ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఫిర్యాదు దారులకు చట్టపరిధిలో న్యాయం చేయండి -అదనపు ఎస్.పి కె.ప్రకాష్ బాబు

ఫిర్యాదు దారులకు చట్టపరిధిలో న్యాయం చేయండి -అదనపు ఎస్.పి కె.ప్రకాష్ బాబు

📰 Generate e-Paper Clip

జిల్లా పోలీసు కార్యాలయం” ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కు 112 పిటీషన్లు

గరుడవాద్రి న్యూస్ కడప జులై 20 :
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు వచ్చిన ఫిర్యాదు దారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని అదనపు ఎస్.పి శ్రీ కె.ప్రకాష్ బాబు పోలీసు అధికారులను ఆదేశించారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు అదనపు ఎస్.పి శ్రీ కె.ప్రకాష్ బాబు సోమవారం ” ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు.
జిల్లా లోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ప్రజలతో అదనపు ఎస్పీ మాట్లాడి వారి ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
సుదూర ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులకు పోలీసు సిబ్బంది ప్రశాంతంగా తమ సమస్యను వివరించడానికి సహాయం చేశారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్పీ శ్రీ ఎన్. సుధాకర్, డి.టి.సి డి.ఎస్పీ శ్రీ అబ్దుల్ కరీం, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!