ePaper
Thursday, September 17, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిబైరెడ్డిపల్లి లో కొనసాగిన ప్రధానమంత్రి టీబి ముక్తభారత్ అభియాన్ కార్యక్రమం

బైరెడ్డిపల్లి లో కొనసాగిన ప్రధానమంత్రి టీబి ముక్తభారత్ అభియాన్ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జులై20

ప్రధానమంత్రి టీబి ముక్తభారత్ అభియాన్ కార్యక్రమం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు సోమవారం వైద్యాధికారి విజయ్ చంద్ర అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా టీబీ జబ్బు స్క్రీనింగ్ కొరకు హ్యాండిల్ ఎక్స్రేలు తీయడం జరిగినది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు, పొగ త్రాగేవారికి మద్యం తాగే వారికి, BMI 18 కంటే తక్కువ ఉన్నవారికి, ఇతర క్రానిక్ జబ్బులు ఉన్నవారికి, హెచ్ఐవి, ఎయిడ్స్ ఉన్నవారికి మొదలగు వారికి 85 మందికి ఎక్స్రే X-ray తీశారు. క్షయ వ్యాధిని ప్రారంభ దశ లో గుర్తించి పూర్తిగా నయం చేయవచ్చునని వైద్యాధికారి తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిహెచ్వో జయంతి, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సావిత్రి ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!