ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఆర్‌కేఎస్‌ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, లో ఎన్సిసి ఎంపిక

ఆర్‌కేఎస్‌ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, లో ఎన్సిసి ఎంపిక

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం. జూలై 22 గరుడదాద్రి న్యూస్ కార్వేటి నగరంలో ఉన్న
ఆర్‌కేఎస్‌ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కార్వేటినగరంలో 35 ఆంధ్ర బెటాలియన్, చిత్తూరు ఆధ్వర్యంలో ఎన్‌సీసీ క్యాడెట్ల ఎంపిక కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.
ఈ ఎంపికలో 25 మంది బాలురు మరియు బాలికలు ఎన్‌సీసీ క్యాడెట్లుగా ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులకు రెండు సంవత్సరాల పాటు నాయకత్వం (Leadership), ఆయుధాలపై ప్రాథమిక శిక్షణ (Weapon Training), డ్రిల్, ఆరోగ్యం మరియు పరిశుభ్రత (Health & Hygiene), క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావం వంటి అంశాలలో శిక్షణ అందించబడుతుంది.
శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన క్యాడెట్లకు ఎన్‌సీసీ ‘A’ సర్టిఫికెట్ ప్రదానం చేయబడుతుంది. ఈ సర్టిఫికెట్ ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు మరియు రక్షణ దళాల్లో చేరేందుకు ప్రత్యేక ప్రయోజనాన్ని కల్పిస్తుంది.ఈ ఎంపిక ప్రక్రియను 35 ఆంధ్ర బెటాలియన్, చిత్తూరు ఎంపిక కమిటీ సభ్యులు హవల్దార్ డి.ఎన్. రెడ్డి, హవల్దార్ బల్విందర్ సింగ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోటేశ్వరరావు, ఉమాశంకర్ , రవి , మాండవ్య , రమేష్ , శివశంకర్ శ్రీను సీటీఓ తారక్ రామ్ సమక్షంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు ఎన్‌సీసీ క్యాడెట్లు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!