ePaper
Sunday, September 13, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిదారి సమస్యను పరిష్కరించండి గ్రామస్తులు మొర

దారి సమస్యను పరిష్కరించండి గ్రామస్తులు మొర

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం జూలై 23 గరుడ దాద్రి న్యూస్ కార్వేటి నగర మండలం పరిధిలోని డిఎం పురం పంచాయతీ పరిధిలో ఉన్న కరవాటికండిగ గ్రామం ఏర్పడి దాదాపుగా 150 సంవత్సరాలు కావస్తుందని మునిరత్నం నాయుడు 89, గ్రామస్తులు తెలియజేశారు. 20 13 వరకు గ్రామానికి వెళ్లడానికి దారి లేక పొలాల గట్టున వెళ్లే వారిని పేర్కొన్నారు. 20 14 లో డిఎం పురం ఎంపీటీసీ సభ్యులు ఎర్రగోటి రాధాకృష్ణ యాదవ్ దారి లేక అవస్థలు పడుతున్నారని తెలుసుకొని సంబంధిత అప్పటి ఎంపీడీవో శ్రీనివాస ప్రసాద్ తో చర్చించి మట్టి రోడ్డు ఏర్పాటు చేశారు. ఇటీవల ఆ రోడ్డును అదే గ్రామానికి చెందిన వ్యక్తిదారిని లోడి రాతి కుషాలు అడ్డంగా నాటారు. ఈ విషయాన్ని మండల తాసిల్దార్ కు, ఎస్ఐకి, ఎంపీడీవో కు, జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వడం జరిగిందని గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామస్తులకు దారి పరిష్కారం కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా అధికారులను కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!