ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిసీజేపీ ఆందోళనకు మద్దతుగా పిచ్చాటూరులో విద్యార్థి సంఘాలు నిరసన

సీజేపీ ఆందోళనకు మద్దతుగా పిచ్చాటూరులో విద్యార్థి సంఘాలు నిరసన

📰 Generate e-Paper Clip

పిచ్చాటూరు జూలై 24 గరుడధాత్రి :
ఢిల్లీలో జరుగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహిస్తున్న ఆందోళనకు మద్దతుగా మండల కేంద్రమైన పిచ్చాటూరులో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది .ఈ సందర్భంగా పాల్గొన్న విద్యార్థి సంఘాల నాయకులు సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నాగరాజు మాట్లాడుతూ దేశంలో విద్యార్థులు కష్టపడి ప్రవేశ పరీక్షలు రాసే సందర్భంగా ముందుగానే ప్రశ్నాపత్రాలు లీక్ అవడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పాలయ్యారని దీనికి కారణమైన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జరుగుతున్న ఆందోళన కు మద్దతుగా పిచ్చాటూరులో కూడా విద్యార్థి సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు. తక్షణమే మోడీ ప్రభుత్వం స్పందించి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను మంత్రివర్గం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు లేకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలో తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మునిశంకర్ విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!