ఆర్.ఏ.ఆర్.ఎస్ శాస్త్రవేత్త డా. డి. దేవకి
బైరెడ్డిపల్లి గరుడదాత్రి జులై25
రైతులు సోయాబీన్ పంటను శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం ద్వారా అధిక దిగుబడులు, నాణ్యమైన ఉత్పత్తి ,అధిక ఆదాయం సాధ్యం అని ఆర్.ఏ.ఆర్.ఎస్ శాస్త్రవేత్త డా. డి. దేవకి పేర్కొన్నారు. .బైరెడ్డిపల్లి మండలం పాతూరునత్తంలో సోయాబీన్ సాగుపై రైతులకు శిక్షణ కార్యక్రమం ను పాతూరునత్తం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సోయాబీన్ సాగుపై రైతుల శిక్షణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా సోయాబీన్ సాగును ఈ ఖరీఫ్ లో ప్రభుత్వం 100% సబ్సిడీ తో ప్రోత్సహించడం గొప్ప విషయం. అందించిన నాణ్యమైన విత్తనాల ను విత్తన శుద్ధి థైరామ్ 2గ్రాములు ఒక కేజీ విత్తనానికి కలిపి విత్తనాశుద్ధి చేసుకోవాలి.సరైన విత్తే సమయం, విత్తన మోతాదు, సమతుల్య ఎరువుల వినియోగం, సకాలంలో సమగ్ర చీడపీడల యాజమాన్యం (IPM), కలుపు నివారణ చేసికోవాలి అని సూచించడమైనది. వర్షాధార ప్రాంతాల్లో పాటించాల్సిన సాగు విధానాలు, నీటి యాజమాన్య పద్ధతులు, కోత అనంతర నిర్వహణ వంటి అంశాలపై రైతులకు క్షేత్రస్థాయిలో ప్రదర్శనతో అవగాహన కల్పించారు. శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం ద్వారా అధిక దిగుబడులతో పాటు నాణ్యమైన ఉత్పత్తి సాధించి రైతులు అధిక ఆదాయం పొందవచ్చని డా. డి. దేవకీ గారు తెలిపారు.మండల వ్యవసాయ అధికారి శ్రీమతి గీతా కుమారి మాట్లాడుతూ వరి నారు వేసుకున్న రైతులు వరి కి బదులు ఆరు తడి పంటలు సాగు చేసుకోవాలని సూంచించారు. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు పంట భీమా చేసుకుని ఎల్నీనో ప్రభావం నుండి పంటల నష్టం కొరకు భీమా చేయనుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు.
రైతులు అడిగిన సందేహాలకు శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు సమగ్రంగా సమాధానాలు ఇచ్చి, సోయాబీన్ సాగులో ఆధునిక సాంకేతికతలను అవలంబించాలని సూచించారు. శిక్షణ అనంతరం రైతులకు సాంకేతిక కరపత్రాలు పంపిణీ చేసి, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి వ్యవసాయ శాఖను సంప్రదించాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సుబ్రహ్మణ్యం శెట్టి , కుమారి , ఆర్‌ఎస్‌కే ఇన్‌చార్జ్‌లు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
