ePaper
Monday, September 14, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కీలపూడిలో అంబరాన్నంటిన వినాయక చవితి సంబరాలు

కీలపూడిలో అంబరాన్నంటిన వినాయక చవితి సంబరాలు

📰 Generate e-Paper Clip

పిచ్చాటూరు, సెప్టెంబర్ 14 గరుడదాత్రి న్యూస్:

తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం కీలపూడి గ్రామంలో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో అంబరాన్నంటాయి. గ్రామంలో ఎటుచూసినా పండుగ సందడి నెలకొనగా, వినాయకుని దర్శించుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
స్థానిక సీనియర్ టీడీపీ నాయకులు పద్మనాభ రాజు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, గ్రామ పెద్దలు రమేష్ రాజు, పాల పద్మనాభం ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను కన్నుల పండువగా నిర్వహించారు.
వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మహిళలు, చిన్నారులు, యువత తప్పెట తాళాలకు అనుగుణంగా ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. దీంతో కీలపూడి గ్రామంలో ఆధ్యాత్మికతతో పాటు పండుగ ఉత్సాహం వెల్లివిరిసింది.
గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వినాయకుని ఆశీస్సులు పొందారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వేడుకలు ప్రశాంతంగా జరిగేలా నిర్వాహకులు చర్యలు చేపట్టారు.అలాగే గ్రామ పెద్దలు మహిళలు యువత గ్రామ ప్రజలు , పెద్ధ ఎత్తున వినాయక స్వామి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!