ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్వైభవంగా శ్రీదేవి-భూదేవి సమేత శ్రీ శేషాద్రిస్వామికి పౌర్ణమి పూజలు

వైభవంగా శ్రీదేవి-భూదేవి సమేత శ్రీ శేషాద్రిస్వామికి పౌర్ణమి పూజలు

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జులై29

బైరెడ్డిపల్లి లో వెలిసివున్న శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ శేషాద్రిస్వామికి బుధవారం వైభవంగా గురు పౌర్ణమి పూజలు నిర్వహించారు. అర్చకులు తిప్పాచార్యులు బృందం చే శాస్త్రోక్తంగా పౌర్ణమి పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామి మూలవర్లకుకి పంచామృత అభిషేకం చేపట్టారు.అనంతరం దేవత మూర్తులను వివిధ ఆభరణాలు, రంగురంగుల పూలతో శోభాయానంగా తీర్చిదిద్దే మహామంగళహారతి చేపట్టారు.భక్తులకు తీర్థ ప్రసాద వితరణ కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఉభయదార్లుగా భవాని హోటల్ చంగలరాయప్ప కుటింభీకులు,శేషాద్రి స్వామి సేవకుడు ధనంజయ గౌడు,అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!