ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

📰 Generate e-Paper Clip

* గరిగ శీనే పల్లి గ్రామంలో మహిళలతో ముఖాముఖి లో పాల్గొన్న నారా భువనేశ్వరి.
కుప్పం,జులై 29 (గరుడ ధాత్రి న్యూస్): మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా మూడవరోజు బుధవారం కుప్పం రూరల్ మండలం గరిగసినేపల్లి గ్రామంలో మహిళలతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ, ఇంటికో పారిశ్రామికవేత్తను చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు.గరిగచ్చీనపల్లి గ్రామం, జడ్పీ హైస్కూల్ విద్యార్థులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ,విద్యారంగంలో సంస్కరణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకదృష్టి పెట్టారు.విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా అనేక పథకాలను అమలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో మంచి ఫలితాలు వస్తున్నాయి.ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు రావడం శుభ పరిణామం.ఆసక్తి ఉన్న రంగంలో విద్యార్థులు ప్రతిభ కనబరచాలి.
సమయం వృథా చేయకూడదు. క్రమశిక్షణతో మెలగాలి.
తల్లిదండ్రుల కష్టాన్ని అర్ధం చేసుకుని బాగా చదువుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కుప్పం నియోజకవర్గ పరిధిలోని నాయకులు, చంద్రబాబు కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!