బైరెడ్డిపల్లి గరుడదాత్రి జులై29
ప్రస్తుతం నెలకొన్న వర్షా బావ పరిస్థితుల నుండి అధిక వర్షాలు కురిసి పంటలు సస్యశ్యామలంగా పండాలని
శ్రీ పరాభవనామ సంవత్సరం ఆషాడ శుక్ల పౌర్ణమి (గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి,బుద్ధ పౌర్ణమి) సందర్భంగా బుధవారం బైరెడ్డిపల్లి మండలం లోని కుప్పనపల్లె లో వెలసిన
శ్రీ కాలభైరేశ్వర స్వామి ఆలయం నందు అర్చకులు మురళీధరాచార్యులు మూలవర్లకు నిర్మాల్య పూజ చేసి, కలశ స్థాపన చేసి నది దేవతలను ఆవాహన చేసి వరుణ పూజలు చేశారు. అనంతరం కాలభైరవ స్వామికి సుగంధ పుష్పాలతో అలంకరించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమమునకు నీలమ్మ బాలరాజు, కృష్ణప్ప ప్రభాకర్ బైరప్ప చిరంజీవి ఉబయదారులుగా వ్యవహరించారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
