చిత్తూరు జూలై 29 గరుడ ధాత్రి న్యూస్
చిత్తూరు రూరల్ మండలం చెరువు ముందర ఊరు గ్రామం శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఇందులో భాగంగా స్వామివారికి ఉదయం అభిషేకం నిర్వహించి వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకి అన్నదానం రాత్రి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఆలయంలో ప్రతి పౌర్ణమికి స్వామివారికి అభిషేకాలు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని ఆలయ ధర్మకర్త కె మురుగయ్య తెలిపారు.
