ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు

ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు

📰 Generate e-Paper Clip

* ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం.
కుప్పం,నులై 31 (గరుడ ధాత్రి న్యూస్): ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్, కుప్పం టిడిపి ఇన్చార్జ్ పి.ఎస్. మునిరత్నం అన్నారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, కుప్పం బైపాస్ రోడ్ లోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. కుప్పం నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, ప్రజా సమస్యలతో పాటు భూ ,సమస్యలను పార్టీ ఇంచార్జ్ దృష్టికి తీసుకువచ్చారు. వాటిని ఓర్పుతో ఆలకించి సంబంధిత అధికారులతో చర్చించి సత్వర పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టడం జరిగింది.
ప్రజల సమస్యల పరిష్కారమే రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని పేర్కొంటూ ప్రతి విజ్ఞప్తిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వేగంగా పరిష్కరించేలా సూచించడం జరిగింది. కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!