ePaper
Sunday, August 2, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్దగా డీఎస్సీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి అమలుపై నేడు టౌన్‌హాల్ సమావేశం

దగా డీఎస్సీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి అమలుపై నేడు టౌన్‌హాల్ సమావేశం

📰 Generate e-Paper Clip

సోమల, ఆగస్టు 2 ( గరుడ ధాత్రి న్యూస్ ):
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు దగా డీఎస్సీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 3వ తేదీన పుంగనూరులో టౌన్‌హాల్ సమావేశం నిర్వహించనున్నట్లు నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు సి. లక్ష్మీపతి రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటలకు పుంగనూరులోని జేఎండీ ఫంక్షన్ హాల్‌లో ఈ సమావేశం జరగనుందని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశానికి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని చెప్పారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి పార్టీ నాయకులు, యువజన, విద్యార్థి, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!