ePaper
Thursday, August 6, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుకు ఆదేశాలు

ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుకు ఆదేశాలు

📰 Generate e-Paper Clip

* కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్.
* కుప్పం బస్టాండ్‌లో ప్రజా సౌకర్యాల మెరుగుపై క్షేత్రస్థాయి పరిశీలన.
* ప్రయాణికుల కోసం నూతన మరుగుదొడ్ల నిర్మాణం – పాత మరుగుదొడ్ల ఆధునికీకరణకు ఆదేశాలు.
కుప్పం,ఆగస్టు 04(గరుడ ధాత్రి న్యూస్): కుప్పం బస్టాండ్‌లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ ఆదేశించారు. మంగళవారం ఆయన కుప్పం ఆర్టీసీ బస్టాండ్ను క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు. ఆకస్మికంగా పర్యటించి బస్టాండ్‌లోని సౌకర్యాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా బస్టాండ్‌లో రోజూ రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు మరింత పరిశుభ్రమైన, ఆధునిక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరాన్ని అధికారులతో సమీక్షించారు. ముఖ్యంగా బస్టాండ్‌లో ప్రజల కోసం నూతన మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని, ప్రస్తుతం ఉన్న మరుగుదొడ్లను పూర్తిస్థాయిలో ఆధునికీకరించి (రిమోడలింగ్) పరిశుభ్రంగా, వినియోగానికి అనువుగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.మరుగుదొడ్లలో నిరంతర పరిశుభ్రత, మహిళలు మరియు పురుషులు ప్రత్యేక సౌకర్యాలు కల్పించేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులను త్వరితగతిన ప్రారంభించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.ఈ సందర్భంగా కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మట్ మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, కుప్పం బస్టాండ్‌ను ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్ పి.ఎస్. మునిరత్నం, కడా సలహా మండలి సభ్యులు రాజ్ కుమార్, కుప్పం పురపాలక సంఘం కమిషనర్ శ్రీనివాసరావు, ఏపీఎస్ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!