పలమనేరు,ఆగస్టు 04 ( గరుడ ధాత్రి ) :
ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్ఐఆర్)–2026 కార్యక్రమంలో భాగంగా పలమనేరు పురపాలక సంఘ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ముసాయిదా ఫోటో ఓటర్ల జాబితాలను జూలై 31న ప్రచురించినట్లు పలమనేరు పురపాలక సంఘ సహాయ ఎన్నికల అధికారి (ఏఈఓ) మరియు కమిషనర్ లోకేశ్వర వర్మ తెలిపారు. మంగళవారం పురపాలక సంఘ కార్యాలయంలో బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్వోలు), సూపర్వైజర్లతో నిర్వహించిన ఎస్ఐఆర్ అమలు సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…పట్టణ పరిధిలోని మొత్తం 42,580 మంది ఓటర్లలో ఇప్పటివరకు 35,610 మంది వివరాలను డిజిటలైజ్ చేశారన్నారు. గడువు ముగిసే నాటికి మ్యాపింగ్ చేసుకోని 1,004 మంది ఓటర్లకు శుక్రవారం నుంచి నోటీసులు పంపనున్నారు. అలాగే తండ్రి/తల్లి పేరు, చిరునామా, వయస్సు వ్యత్యాసం వంటి 11 రకాల లాజికల్ ఎర్రర్ అనామలీస్ (తార్కిక దోషాలు) ఉన్న ఓటర్లకు కూడా నోటీసులు జారీ చేస్తారన్నారు.తార్కిక దోషాలు సరిదిద్దుకునేందుకు బీఎల్వోలు నాల్గోసారి ప్రతి రోజూ ఇంటింటికీ వచ్చి సరైన ధృవీకరణ పత్రాలు స్వీకరిస్తారన్నారు.’అన్-కలెక్టబుల్’గా గుర్తించిన 6,970 పేర్లను జాబితా నుండి తొలగించనున్నారు. ఇవి ముసాయిదా జాబితాలో కనిపించవు.ఫారాలను బల్క్ (గుంపు) రూపంలో ఇవ్వడం కానీ, స్వీకరించడం కానీ జరగదన్నారు. క్లెయిమ్లు & అభ్యంతరాల స్వీకరణ జూలై 31 నుండి ఆగస్టు 30 వరకు. విచారణ పూర్తి: సెప్టెంబర్ 28 లోపు.తుది ఓటర్ల జాబితా ప్రచురణ తేది అక్టోబర్ 3.
వివిధ సేవలకు సంబంధిత ఫారాలు (ఫారం–6: కొత్త ఓటరు నమోదుకు, ఫారం–7: పేర్ల తొలగింపు లేదా అభ్యంతరాలకు, ఫారం–8: సవరణలు, ఒక పోలింగ్ కేంద్రం నుంచి మరొకదానికి బదిలీకి
ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఎన్నికల యంత్రాంగానికి రాజకీయ పార్టీలు, గుర్తింపు పొందిన బూత్ లెవల్ ఏజెంట్లు సహకరించాలని కమిషనర్ కోరారు. అర్హులైన ప్రజలందరూ తమ పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయో లేదో బీఎల్వోల వద్ద సరిచూసుకుని, ఏవైనా మార్పులు ఉంటే గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
