ePaper
Saturday, August 8, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికష్టపడి పని చేయడమే విజయానికి ఏకైక మార్గం

కష్టపడి పని చేయడమే విజయానికి ఏకైక మార్గం

📰 Generate e-Paper Clip

* బీసీఎన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ బీసీ నాగరాజ్.
* కె ఈ సి లో జాతీయ స్థాయి సాంకేతిక సదస్సు.
కుప్పం, ఆగస్టు 08 (గరుడ ధాత్రి న్యూస్):

కుప్పం ఇంజినీరింగ్ కళాశాల (స్వయంప్రతిపత్తి)లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్) విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన 2కె26″ జాతీయ స్థాయి సాంకేతిక సదస్సు శనివారం కళాశాల ప్రాంగణంలోని డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం బ్లాక్లో ఘనంగా నిర్వహించబడింది.
కార్యక్రమానికి బీసీఎన్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ డా. బి.సి. నాగరాజ్, వైస్ ఛైర్మన్ డా. ఎన్. సునీల్ రాజ్, సెక్రటరీ ఎన్. సాగర్ రాజ్, కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. సుధాకర్ బాబు, వైస్ ప్రిన్సిపాల్ డా. ఎస్. బాస్కరన్, ఆర్ అండ్ డి డైరెక్టర్ డా. జి.ఎన్. కోదండ రామయ్య, అధ్యాపకులు, విద్యార్థులు మరియు రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్ కళాశాలల నుండి వచ్చిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి కళాశాల పూర్వ విద్యార్థి, గ్లోబల్ ఫిన్‌టెక్ పేమెంట్స్ సొల్యూషన్స్ రంగంలో సీనియర్ మేనేజ్‌మెంట్ హోదాలో సేవలందిస్తున్న మంజునాథ్ ఎం. ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా ఇంజినీరింగ్, ఫిన్‌టెక్ మరియు డిజిటల్ పేమెంట్స్ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న అవకాశాలను వివరించారు. విద్యార్థులు కేవలం డిగ్రీ సాధించడంపైనే కాకుండా, సమస్యలను విశ్లేషించే సామర్థ్యం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నిరంతర అభ్యాసం, ఆవిష్కరణాత్మక ఆలోచనా విధానం మరియు పరిశ్రమకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారువైస్ ఛైర్మన్ డా. ఎన్. సునీల్ రాజ్ మాట్లాడుతూ, నేటి ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , మెషిన్ లెర్నింగ్ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతూ ప్రతి పరిశ్రమను ప్రభావితం చేస్తున్నాయని అన్నారు. ఈ మారుతున్న సాంకేతిక ధోరణులకు అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకోవాలని సూచించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం, సమస్య పరిష్కార నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్‌వర్క్ వంటి అంశాలను అభివృద్ధి చేసుకుంటేనే ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని తెలిపారు.
బీసీఎన్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ డా. బి.సి. నాగరాజ్ మాట్లాడుతూ, కష్టపడి పనిచేయడమే విజయానికి ఏకైక మార్గమని పేర్కొన్నారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా సిలబస్‌కు అతీతంగా కొత్త విషయాలను నేర్చుకోవాలని, ఆధునిక సాంకేతికతలను స్వయంగా అధ్యయనం చేయాలని సూచించారు. జీవితంలో క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావం, నిరంతర సాధన ఉంటే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని విద్యార్థులకు ప్రేరణనిచ్చారు.
కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. సుధాకర్ బాబు మాట్లాడుతూ, జాతీయ స్థాయి సాంకేతిక సదస్సులు విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశోధనా దృక్పథం, నాయకత్వ లక్షణాలు మరియు పోటీ తత్వాన్ని పెంపొందిస్తాయని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!