ePaper
Saturday, August 8, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఇది మా కష్టం-మా ప్రతిభ- అవమానిస్తే ఊరుకోము

ఇది మా కష్టం-మా ప్రతిభ- అవమానిస్తే ఊరుకోము

📰 Generate e-Paper Clip

* కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద కదం తొక్కిన ఉపాధ్యాయులు
* డీఎస్సీ పై అసత్య ఆరోపణలు సరికాదు
* ఉపాధ్యాయుల ఆగ్రహం
కుప్పం,ఆగస్టు 08 (గరుడ ధాత్రి న్యూస్):

ఇది మా కష్టం, మా ప్రతిభ, అవమానిస్తే ఊరుకోబోమని ఉపాధ్యాయులు హెచ్చరించారు. ఇటీవల రాష్ట్రంలో కొనసాగిన డీఎస్సీ నియామకాల పై వైసిపి రాద్ధాంతం చేయడం పట్ల ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై శనివారం కర్నూలులో కొండారెడ్డి బురుజు వద్ద ఉపాధ్యాయులు నిరసన తెలియజేశారు. కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద మెగా డీఎస్సీ ఉపాధ్యాయులు ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. కడప కర్నూలు అనంతపురం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఆత్మగౌరవ ర్యాలీలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్లకార్డులు చేత పట్టుకొని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ పై వైసీపీ నేతలు కుట్రలు ఆపాలని హెచ్చరించారు. ప్రభుత్వం వాస్తవాలు వివరించిన పదేపదే మెగా డీఎస్సీ పై తప్పుడు ప్రచారాలు చేయడం వైసీపీకి తగదని హితవు పలికారు. వైసీపీ నేతలు కావాలనే తమ ఆత్మ గౌరవం పై పదేపదే దాడి చేస్తున్నారని విరుచుకుపడ్డారు. కొండారెడ్డి బురుజు ఎక్కి నిరసన తెలిపారు. ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించడం చేతకాని నేతలు నేడు విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్లు తమను అవమానిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!