ePaper
Monday, August 10, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఇంటింటికి తెలుగుదేశం'తో ప్రజల ముంగిటకు ప్రభుత్వ ప్రగతి

ఇంటింటికి తెలుగుదేశం’తో ప్రజల ముంగిటకు ప్రభుత్వ ప్రగతి

📰 Generate e-Paper Clip

* వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు.
* కొత్తపేట గ్రామంలో మంత్రి ఇంటింటా ప్రచారం.
కుప్పం,ఆగస్టు 09 (గరుడ ధాత్రి న్యూస్): రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి తీసుకెళ్లడమే లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు పేర్కొన్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ‘ఇంటింటికి తెలుగుదేశం’ నినాదంతో 45 రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా మంత్రి అచ్చెన్నాయుడు ఆదివారం టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళి మండలం కొత్తపేట గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సాధించిన విజయాలను ప్రజలకు వివరించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో 99 శాతం హామీలను అమలు చేసినట్లు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!