జిల్లాలో ఉన్న అన్ని గిరిజన సంక్షేమ వసతి గృహాలలో మౌలిక వసతులు కల్పిస్తాం.
–జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
చిత్తూరు, ఆగస్టు,9:(గరుడ దాత్రి న్యూస్)జిల్లాలోని గిరిజనులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పిలుపునిచ్చారు.
ఆదివారం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు -2026, స్థానిక కలెక్టరేట్లో లోని డిఆర్డిఏ సమావేశ హాలునందు నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగానివాళులర్పించారు. జ్యోతి ప్రజలను గావించి కార్యక్రమాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొనగా ట్రైనింగ్ కలెక్టర్ వెంకటేష్ , గిరిజన సంక్షేమ అధికారి శివ ప్రసాద్, గిరిజన నాయకులు చిరంజీవులు, జీవీ రమణ, రాజశేఖర్, రవి నాయక్,జిల్లా విజిలెన్స్ మానిటర్ కమిటీ SC,ST, మెంబర్లుమునస్వామి, రాజకుమార్,రఘురాంతదితరులు ,సుగుణమ్మ, దేవరాజులు, రవి, రాఘవాచారి, శీను,
పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనులు తమపిల్లలనుతప్పనిసరిగాచదివించుకోవాలన్నారు. ఆదివాసీ యువత తమ సంప్రదాయ, సాంస్కృతిక మూలాలకు క్రమంగా దూరమవుతున్నాదన్నారు. జిల్లాలో 60 వేల జనాభా గిరిజనులున్నట్లు తెలిపారు. దాదాపు 600 నివాస ప్రాంతాలలో మౌలిక వసతులనుగుర్తించామన్నారు.2025-26ఆర్థికసంవత్సరానికిప్రస్తుతఆర్థికసంవత్సరానికిఇప్పటివరకు 2,907 మంది గిరిజన లబ్ధిదారులకు రూ.6.52 కోట్ల విలువైన వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందించడం జరిగింది.
అటవీ హక్కుల చట్టం–2006 (RoFR):
అటవీ ప్రాంతాల్లో 2005 సంవత్సరానికి ముందు నుంచి సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు అటవీ హక్కుల చట్టం కింద 22 మంది గిరిజన రైతులకు 19.99 ఎకరాలకు వ్యక్తిగత పట్టాలు మంజూరు చేయడంతో పాటు, ఒక సామాజిక క్లెయిమ్ కింద 50 మంది గిరిజనులకు హక్కులు కల్పించారు. సామాజిక క్లెయిమ్ కింద 41.00 ఎకరాలకు హక్కులు కల్పించడం జరిగిందిఅటవీ హక్కుల చట్టం కింద పట్టాలు పొందిన గిరిజన రైతులకు సంవత్సరానికి మూడు విడతలుగా రూ.20,000 చొప్పున ఆర్థిక సహాయం అందుతోంది. ఇందులో పీఎం కిసాన్ పథకం కింద రూ.6,000, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.14,000 అందజేస్తోంది. 2025-26ఆర్థికసంవత్సరంలో 98 మంది గిరిజన రైతులకు రూ.8.96 లక్షలు మంజూరు చేయడం జరిగింది.కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలోని 3 గిరిజన విద్యాసంస్థల్లో 3 పనులకు రూ.2.64 కోట్లను మంజూరు చేశారు. ఇందులో ఒక పని పూర్తికాగా, మరో రెండు పనులుకొనసాగుతున్నాయి. అలాగే 2 RO ప్లాంట్లు, అదనంగా 5 టాయిలెట్లు, 5 బాత్రూమ్ల నిర్మాణానికి రూ.17.70 లక్షలు మంజూరు చేశారు.
జిల్లాలోని గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. జిల్లాలో సుమారు 60 వేల మంది గిరిజనులు ఉన్నారని, వారి సమస్యలను గుర్తించి దశలవారీగాపరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, రహదారి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించామని, ఇప్పటికే గుర్తించిన ఆరు రోడ్ల నిర్మాణానికి త్వరలో అనుమతులు, నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించేలా చర్యలుతీసుకుంటున్నామని తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో ఈ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతుల మెరుగుదలకు చర్యలు చేపట్టామని, ఇప్పటికే కొన్ని వసతి గృహాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించామని, మిగిలిన వసతి గృహాల్లో మరుగుదొడ్లు, విద్యుత్ దీపాలు తదితర సౌకర్యాలను త్వరలో కల్పిస్తామని తెలిపారు. గిరిజన వసతి గృహాలను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.ఆధార్, రేషన్ కార్డులు తదితర పత్రాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా పెద్దఎత్తున అర్జీ పరిష్కార శిబిరాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతి 15 రోజులకు ఒకసారి దరఖాస్తులను సమీక్షించి, పెండింగ్ సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, స్థానిక గిరిజన నాయకులు తమ ప్రాంతాల్లోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ కోరారు. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం (PGRS) ద్వారా గిరిజనుల సమస్యలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
గ్యాప్ ఏరియాల్లో సాగు చేస్తున్న గిరిజన రైతులకు వ్యక్తిగత పట్టాలు మంజూరు చేసే అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని తెలిపారు. ఇందుకోసం తహసీల్దార్లతో సమన్వయం చేసుకుని వచ్చే ఆరు నెలల్లో అర్హులైన రైతులకు పట్టాలు అందించేలా చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. పట్టాలు లభిస్తే రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సబ్సిడీలు, రైతు సహాయ కార్యక్రమాల ప్రయోజనాలు అందుతాయని వివరించారు.గిరిజన ప్రాంతాల్లో కమ్యూనికేషన్, మొబైల్ నెట్వర్క్ సమస్యలను పరిష్కరించేందుకు BSNL, Airtel, Jio తదితర టెలికాం సంస్థలతో సమన్వయం చేస్తామని తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్త కమ్యూనికేషన్ టవర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడతామని, వసతి గృహాల్లో ఉపాధ్యాయుల ఖాళీలను కూడా సమీక్షించి భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తామని కలెక్టర్ తెలిపారు.గిరిజనుల సమస్యలను అధికారులు అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలని, సమస్యలు తమ దృష్టికి వచ్చిన వెంటనే అవసరమైన నిధులు, వనరులను సమకూర్చి పరిష్కారం చూపాలని ఆదేశించారు. గిరిజన నాయకులు, ప్రజాప్రతినిధులు మరింత చురుకుగా పనిచేసి క్షేత్రస్థాయిలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ట్రైనింగ్ కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టి వివిధ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తెలిపారు, సాంస్కృతికకార్యక్రమాలలో పాల్గొన్న విద్యార్థులకు జిల్లా కలెక్టర్ బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గిరిజన కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
