ePaper
Wednesday, August 12, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పూతలపట్టులో డీఎస్సీ పై వైసీపీ ర్యాలీ- పోలీసులపై దూసుకెళ్లిన వైసిపినాయకులు

పూతలపట్టులో డీఎస్సీ పై వైసీపీ ర్యాలీ- పోలీసులపై దూసుకెళ్లిన వైసిపినాయకులు

📰 Generate e-Paper Clip

పూతలపట్టు ఆగస్టు 10 (గరుడ రాత్రి న్యూస్)

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు డీఎస్సీ పై గత మూడు రోజులుగా వైసిపి ప్రజా ప్రతినిధులు నిరాహార దీక్షలు చేపట్టారు. సోమవారం నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ర్యాలీలు నిర్వహించాలని పార్టీ ఆదేశించడంతో పూతలపట్టు మండల కేంద్రంలో రాష్ట్ర మేధావుల సంఘం కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్ అధ్యక్షతన ర్యాలీ కార్యక్రమం చేపట్టారు
నియోజకవర్గంలోని ఐదు మండలాల కన్వీనర్లు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు.వెంకటేశ్వర కళ్యాణ్ మండపం నుండి అంబేద్కర్ విగ్రహానికి ర్యాలీగా వచ్చారు.అయితే పోలీసులు హై స్కూల్ వద్ద బ్యారికెట్స్ పెట్టి కార్యకర్తలను నాయకులను నిలుపుదల చేశారు. రహదారిలో ధర్నాలు చేయకూడదని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ముందు రోజే పోలీసులు నాయకులకు సమాచారం అందించారు. అయితే వాటిని నాయకులు కార్యకర్తలు ఎవ్వరూ లెక్క చేయలేదు.శాంతియుతంగా కొంతమంది వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వెళ్ళండి అని సి ఐ తిమ్మప్ప చెప్పడంతో వైసిపి నాయకులు వినకుండా పోలీసుల పై దూసుకెళ్లారు. పోలీసులు పెట్టిన బ్యారికెట్స్ రోప్స్ ను పోలీసులను దోచుకుని వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.ఈ తోపులాటలో పూతలపట్టు ఏఎస్ఐ జ్యోతి కింద పడిపోవడంతో తలకు గాయమైంది. ఆమె కింద పడిన వైసిపి నాయకులు లెక్క చేయలేదు.దీని గమనించిన సమన్వయకర్త సునీల్ కుమార్ ఏఎస్ఐ జ్యోతి కి సారీ చెప్పి వాళ్ల కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని వెళ్లిపోయారు. పూతలపట్టు కూర వయసులో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కళ్యాణ మండపంలో మీడియా సమావేశంలో డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ డీఎస్సీ ఉపాధ్యాయులకు న్యాయం జరిగే వరకు వైసిపి తరఫున పోరాటం చేస్తూనే ఉంటామని డీఎస్సీ నిష్పక్షపాతంగా జరిగి ఉంటే విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సిబిఐ దర్యాప్తు ఒక్కోవాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో ఫెయిల్యూర్ అయ్యారని ఆయన దూయపడ్డాడు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లలిత్ కుమారి. మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ధనంజయ రెడ్డి. రాష్ట్ర పాలయాకిరి అధ్యక్షుడు కుమార్ రాజా.ఐరాల. పూతలపట్టు. బంగారుపాలెం. తవణం పల్లె . కన్వీనర్లు బుజ్జి రెడ్డి. సుధాకర్ రెడ్డి. రామచంద్రారెడ్డి. హరి రెడ్డి. రాష్ట్ర రైతు విభాగం అధికార ప్రతినిధి ప్రవీణ్ రెడ్డి. ఎంపీపీ మోహన్. వైస్ ఎంపీపీలు శిరీష రెడ్డి. ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి. రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి హరీష్. రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి దొరబాబు.. రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి యతీష్. నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షు డు రామచంద్ర. మాజీ సర్పంచ్ మాస్లమని మహిళా అధ్యక్షురాలు జ్యోతి. నాయకులు. ఖాదరవల్లి. లోకనాథ్ రెడ్డి. రమణ. నిరంజన్ రెడ్డి. సిద్ధారెడ్డి. ముత్రేవల భరత్ రెడ్డి. మాస్లమని. సుధాకర్. ప్రేమ్ కుమార్. హరీష్ రెడ్డి. నూతన ప్రసాద్. రెడ్డప్ప. తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!