ePaper
Friday, August 21, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్నాయుడుపేటలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

నాయుడుపేటలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

📰 Generate e-Paper Clip

-స్వర్ణముఖి ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

-గాంధీజీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు

-ఉత్సాహంగా పాల్గొన్న యూనియన్ నాయకులు, ఫోటోగ్రాఫర్లు

గరుడధాత్రి నాయుడుపేట ఆగస్టు 19

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాయుడుపేట పట్టణంలో స్వర్ణముఖి ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు, అవగాహన ర్యాలీ అత్యంత ఘనంగా నిర్వహించారు.

-గాంధీ పార్క్ నుంచి బస్ స్టాండ్ వరకు భారీ ర్యాలీ

పట్టణంలోని గాంధీ పార్క్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం ఫోటోగ్రఫీ కళ యొక్క ప్రాముఖ్యతను, చరిత్రను మరియు సాంకేతిక అభివృద్ధిని వివరిస్తూ గాంధీ మందిరం నుంచి ప్రధాన వీధుల మీదుగా పాత బస్ స్టాండ్ వరకు ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. ‘ఫోటోగ్రాఫర్ల ఐక్యత వర్ధిల్లాలి’ అంటూ చేసిన నినాదాలతో పట్టణ వీధులు మారుమోగాయి.
ర్యాలీ అనంతరం పాత బస్ స్టాండ్ సెంటర్‌లో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.

-సమాజంలో ఫోటోగ్రఫీ పాత్ర అద్భుతం

ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. మధురమైన జ్ఞాపకాలను, సమాజంలోని సత్యాలను కళ్లకు కట్టినట్లు దృశ్యరూపంలో భద్రపరిచే శక్తి ఫోటోగ్రఫీకి మాత్రమే ఉందన్నారు. రంగానికి చెందిన ప్రముఖులను స్మరించుకుంటూ, తమ యూనియన్ సభ్యుల సంక్షేమానికి, ఐక్యతకు నిరంతరం కృషి చేస్తామని పునరుద్ఘాటించారు.ఈ వేడుకల్లో నాయుడుపేట స్వర్ణముఖి ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు జి.ఆర్. బాబు, అధ్యక్షులు కె. ధర్మయ్య, ఉపాధ్యక్షులు బి. వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి సి.హెచ్. రవికుమార్, కార్యదర్శి కె.వి. కిషోర్, కోశాధికారి ఎన్. ప్రభాకర్, మరియు సభ్యులు కె. సునీల్, రవీంద్రబాబు, భాషా, ఖలీల్ భాషా, కన్నడి పెంచలయ్య తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!