ePaper
Friday, August 21, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కాణిపాకం బ్రహ్మోత్సవాలపై 22న ఈవోకార్యాలయంలో సమన్వయ సమావేశం

కాణిపాకం బ్రహ్మోత్సవాలపై 22న ఈవోకార్యాలయంలో సమన్వయ సమావేశం

📰 Generate e-Paper Clip

-జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

చిత్తూరు,ఆగస్టు19(గరుడ దాత్రి న్యూస్)

కాణిపాకం స్వయంభువరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో 2026 బ్రహ్మోత్సవాలనువిజయవంతంగానిర్వహించేందుకుసంబంధితశాఖలఅధికారులతోఈనెల22శనివారంకాణిపాకఈవోకార్యాలయంలోని సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకుజరగనున్ననేపథ్యంలోఉత్సవాల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లపై చర్చించేందుకు అన్ని శాఖల అధికారులుహాజరుకావలెనుజిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు నిర్వహించే ఈ సమావేశానికి పోలీస్, రెవెన్యూ, ఆర్టీసీ, వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్‌, విద్యుత్‌, ఆర్‌అండ్‌బీ, అగ్నిమాపక, పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఎక్సైజ్‌ తదితర శాఖలకు చెందిన అధికారులుహాజరుకానున్నారు.బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా,ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అన్ని శాఖలు సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులు సమావేశానికి తప్పనిసరిగా హాజరై ఉత్సవాలవిజయవంతమైన నిర్వహణకుఅవసరమైన చర్యలపైసమగ్రంగాచర్చించనున్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!