ePaper
Tuesday, August 25, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్వైభవంగా శ్రావణమాస రెండవ శనివారం పూజలు

వైభవంగా శ్రావణమాస రెండవ శనివారం పూజలు

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి ఆగస్టు 22 గరుడ దాత్రి న్యూస్

​శ్రావణ మాసం పురస్కరించుకుని స్థానిక రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ విల్లివిరిసింది. పవిత్రమైన శ్రావణ మాసంలో రెండవ శనివారం అత్యంత ప్రాశస్త్యమైన రోజు కావడంతో, శ్రీ స్వామి వారి దివ్య దర్శనం కోసం భక్తులు ఆలయానికి చేరుకున్నారు
​ఆలయ ప్రధానార్చకులు వశిష్టాచార్యుల పర్యవేక్షణలో వేకువజామునే సుప్రభాత సేవతో స్వామి వారి పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. స్వామి వారికి పంచామృతాభిషేకం, విశేష ధూపదీప నైవేద్యాలు సమర్పించిన అనంతరం సర్వభూషణాంబరధారిగా దివ్యాలంకరణ గావించారు. ఈ సందర్భంగా శ్రీ స్వామి వారి దివ్య దర్శనం భక్తులకు నేత్రపర్వంగా నిలిచింది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!